కొత్త రూల్..కారు కొంటున్నారా..పార్కింగ్ ప్లేస్ కంపల్సరీ

కొత్త రూల్..కారు కొంటున్నారా..పార్కింగ్ ప్లేస్ కంపల్సరీ

కారు కొంటున్నారా..కంపల్సరీ పార్కింగ్ ప్లేస్ తప్పనిసరి. ఇంట్లో పార్కింగ్ ప్లేస్ ఉందని రుజువులు చూపిన తర్వాతే కార్లు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. పార్కింగ్ సమస్య రోజురోజుకు పెరిగిపోతుండటంతో ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయి. పార్కింగ్ సమస్య, ట్రాఫిక్ రద్దీకి చెక్ పెట్టేందుకు చెన్నై యూనిఫైడ్ మెట్రోపాలిటన్ అథారిటీ (CUMTA) కొత్త రూల్ తీసుకొచ్చింది. దేశంలో తొలిసారి ఈ విధానం తీసుకొచ్చారు. మద్రాసు హైకోర్టు మార్గదర్శకాల మేరకు హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ డిపార్టుమెంట్ ఈ పాలసీని ఆమోదించింది. రానున్న రోజుల్లో హైదరాబాద్ తో పాటు దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో కూడా ఇలాంటి సిస్టమ్ వచ్చే అవకాశం లేకపోలేదు. ఈ నగరాలన్నీ ట్రాఫిక్ రద్దీతో ఇబ్బంది పడుతున్నవే. ఇక చెన్నై కొత్త రూల్స్ గురించి వివరాల్లోకి వెళితే.. 

చాలా మంది ప్రజలు పార్కింగ్ స్థలం లేకపోయినప్పటికీ ఒకటికంటే ఎక్కువ కార్లను కలిగి ఉంటున్నారు. దీంతో రోడ్డుపై పార్క్ చేయాల్సి వస్తోంది. దీంతో అక్కడి ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీనికి చెక్ పెట్టేందుకుCUMTA కొత్త నిబంధన.దీని  ప్రకారం చెన్నైలో కారు కొనుగోలు చేసే వ్యక్తులు వారి ఇంటిలో పార్కింగ్ లేదా ప్రైవేట్ పార్కింగ్ (ఆఫ్ స్ట్రీట్ పార్కింగ్ స్థలం) ఉన్నట్లు రుజువులు చూపించాల్సి ఉంటుంది. 

ప్రస్తుతం వాహనాలకు ఆఫ్-స్ట్రీట్ పార్కింగ్ లేని సమస్యను పరిష్కరించడానికి CUMTA రెసిడెన్షియల్ పార్కింగ్ పర్మిట్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. విశాలమైన రోడ్లతో నిర్దిష్ట ప్రాంతాలకు పార్కింగ్ అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేస్తారు.

ALSO READ | EV కార్లపైనా పన్ను.. 6 శాతం కట్టాలంటున్న మొదటి రాష్ట్రం ఇదే..!

ప్రైవేట్ భవనాలు, గేటెడ్ కమ్యూనిటీలు, మాల్స్ లలో షేర్డ్ పార్కింగ్ తప్పనిసరి చేసేందుకు CUMTA తమిళనాడు కంబైన్డ్ డెవలప్ మెంట్ బిల్డింగ్ రూల్స్ ను కొన్ని సవరణలు సిఫార్సు చేసింది. వారం, నెలవారీగా ఫీజులతో పబ్లిక్ పార్కింగ్ ఏర్పాటు చేయడం లక్ష్యంగా ఈ సవరణలు చేస్తోంది. 

ఎలక్ట్రిక్ వాహనాలు పెరుగుతున్న క్రమంలో వాటిని ఛార్జింగ్ పాయింట్లను కూడా ఈ పబ్లిక్ పార్కింగ్ లో ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు చేస్తోంది. పబ్లిక్, ప్రయివేట్ ఆఫ్స్ట్రీట్ పార్కింగ్ ఏరియాల్లో 20శాతం ఎలక్ట్రిక్ వాహనాలకు కేటాయించాలని, ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటుచేయనున్నట్లు CUMTA తెలిపింది.