ఎడపల్లి, వెలుగు : నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం బషీర్ ఫారం వద్ద నిజామాబాద్– -బోధన్ ప్రధాన రహదారిపై హరితహారంలో డివైడర్ మధ్య నాటిన మొక్కలకు శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. మండలంలోని బాపూనగర్ గ్రామ శివారు నుంచి జానకంపేట్ గ్రామ శివారు వరకు రోడ్డు డివైడర్‌లో మొక్కలు నాటారు. కొన్ని నెలలుగా వీటిని ఎవరూ పట్టించుకోలేదు.
మొక్కలు 75శాతం ఎండి పోయాయి. మొక్కల మధ్య గడ్డి పెరిగి ఎండి పోయింది. ఈ గడ్డికి శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో మొక్కలు కాలిపోయాయి. మొక్కలకు నీరు పెట్టలేక, గడ్డి ని తొలగించలేక ఇలా నిప్పు పెట్టి వుంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లక్షలు వెచ్చించి నాటిన మొక్కలు ఇలా అగ్నికి ఆహుతయ్యాయి.