ప్రైవేట్ లో ప్లాస్మా దందా!: చర్యలు తీసుకోని రాష్ట్ర సర్కార్

ప్రైవేట్ లో ప్లాస్మా దందా!: చర్యలు తీసుకోని రాష్ట్ర సర్కార్

వెంటిలేటర్‌‌‌‌పై ఉన్నోళ్లకూ ప్లాస్మా ట్రాన్స్‌‌ఫ్యుజన్‌‌
అవసరం ఉన్నా.. లేకున్నా పేషెంట్లకు థెరపీ
రూ.40 వేల నుంచి లక్షల వరకూ వసూలు
కంట్రోల్ చేసే చర్యలు తీసుకోని రాష్ట్ర సర్కార్
హైదరాబాద్‌‌‌‌, వెలుగు: కరోనా పేషెంట్లకు సంజీవనిగా పేర్కొంటున్న ప్లాస్మా థెరపీని కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ‌‌‌‌తమ దోపిడీకి అనువుగా మార్చుకుంటున్నాయి. పది వేలతో పూర్తయ్యే ప్రక్రియకు రూ.40 వేల నుంచి లక్ష రూపాయల వరకూ వసూలు చేస్తున్నాయి. కొన్ని హాస్పిటల్స్‌‌‌‌లోనైతే అవసరం లేని వ్యక్తులకు సైతం ప్లాస్మా ఎక్కిస్తూ అడ్డగోలుగా బిల్లులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఇప్పటికే ఆరోగ్యశాఖకు పలు ఫిర్యాదులు అందినట్టు తెలిసింది. ఇంత జరుగుతున్నా.. రాష్ట్ర సర్కారు ప్రైవేట్‌‌‌‌ను కంట్రోల్ చేసే చర్యలు మాత్రం తీసుకోవడంలేదు.

ఐసీఎంఆర్ రూల్స్‌‌‌‌పాటించట్లే

కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న వ్యక్తుల బ్లడ్ ప్లాస్మాలో యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతాయి. ఇవి వైరస్‌పై పోరాడుతాయి. ఈ యాంటీబాడీస్‌తో కూడిన ప్లాస్మాను కొంత సీరియస్‌గా ఉన్న పేషెంట్లకు ఎక్కిస్తే వాళ్లు త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. అయితే, ఆక్సిజన్‌ స్థాయి కొంత తగ్గినంత మాత్రాన ప్లాస్మా ఎక్కించాల్సిన అవసరం లేదు. అలాగే, వెంటిలేటర్ ‌‌‌‌‌‌‌‌మీద ఉన్న పేషెంట్లకు ప్లాస్మా ఎక్కించినా ప్రయోజనం ఉండదు. అందువల్ల ‘మోడరేట్‌‌‌‌టూ సివియర్’ కండిషన్‌లో ఉన్న వాళ్ల‌కు మాత్రమే ప్లాస్మా పనిచేస్తుందని ఐసీఎంఆర్ ‌‌‌‌‌‌‌‌సూచించింది. కానీ, ఈ సూచనలను ప్రైవేట్ హాస్పిటళ్లు పక్కనబెడుతున్నాయి. కండిషన్‌తో సంబంధం లేకుండా వందలాది మంది పేషెంట్లకు ప్లాస్మా ఎక్కిస్తున్నాయి. బతుకు మీద ఆశతో రోగుల కుటుంబ సభ్యులు ప్లాస్మా దాతల వేటలో పడుతున్నారు. ప్లాస్మా కోసం తమకు రోజుకు 20 నుంచి 30 రిక్వెస్ట్‌‌‌‌ లు వస్తున్నట్టు కాంగ్రెస్ నేత గూడూరు నారాయణరెడ్డితెలిపారు. సైబరాబాద్‌ పోలీసులకు, ఇతరులకు ఇదే తరహాలో కాల్స్ ‌‌‌‌వస్తున్నాయి. సోషల్ మీడియాలో ప్లాస్మా కావాలంటూ మెసేజ్‌‌‌‌లు సర్క్యులేట్ అవుతున్నాయి. ప్రాణాలు కాపాడాలని చాలా మంది డోనర్లు ముందుకొస్తున్నారు.

ప్రైవేటుపై నియంత్రణ ఏది?

ప్రభుత్వ దవాఖాన్లలో ఇప్పటి వరకూ 15 మందికి ప్లాస్మా థెరపీ చేయగా, ప్రైవేట్ హాస్పిటల్స్‌‌‌‌లో 1,200 వందల మందికిపైగా చేశారు. సైబరాబాద్ పోలీసులే 480 మందికి ప్లాస్మా ఇప్పించారు. గూడూరు నారాయణరెడ్డి ద్వారా 150 మంది డొనేట్ చేశారు. చాలా మంది స్వచ్ఛందంగా ప్లాస్మా డోనర్ల‌ను, పేషట్లను కలుపుతూ ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, కొన్ని హాస్పిటళ్లు దీన్ని ఓ వ్యా పారంగా మార్చడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ దందాను కంట్రోల్‌‌‌‌చేయాల్సిన ఆరోగ్యశాఖ అధికారులు తమకేమీ పట్టనట్టే వ్యవహరిస్తున్నారు. గాంధీలో ప్లాస్మాబ్యాంక్ పెడతామని ప్రకటించినప్పటికీ అది అమల్లోకి రాలేదు. ప్లాస్మాబ్యాంక్ పెడితే అవసరమైన వారికి ఇక్కడి నుంచే ప్లాస్మా సప్లై చేసేందు కు చాన్స్ ‌‌‌‌ఉంటుంది. ఇలాగైనా అనవసరపు ప్లాస్మా థెరపీని నియంత్రించే అవకాశం ఉంటుందని డాక్ట‌ర్లు చెబుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం..