కొత్తూరు గుట్ట పరిసరాల్లో ప్లాస్టిక్ నిషేధం : డీఎఫ్వో రాహుల్ కిషన్ జాదవ్ 

కొత్తూరు గుట్ట పరిసరాల్లో ప్లాస్టిక్ నిషేధం : డీఎఫ్వో రాహుల్ కిషన్ జాదవ్ 

 ములుగు, వెలుగు: ప్రముఖ పర్యాటక క్షేత్రం దేవునిగుట్టపై ఉన్న లక్ష్మీనరసింహస్వామి ఆలయ పరిసరాల్లో ప్లాస్టిక్ నిషేధమని, పరిశుభ్రత పాటించాలని డీఎఫ్వో రాహుల్ కిషన్ జాదవ్ సూచించారు. సోమవారం ములుగు మండలం కొత్తూరు సమీపంలోని దేవునిగుట్టపైకి నిర్మిస్తున్న మెట్ల మార్గాన్ని రేంజ్ అధికారి డోలి శంకర్, లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ సభ్యులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్ కు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో లక్ష్మీనరసింహస్వామి ఆలయ అధ్యక్షుడు కిషన్ రావు, 22 మంది కమిటీ సభ్యులు, ఫారెస్ట్ సిబ్బంది పాల్గొన్నారు.