శ్రీశైలం ఆలయంలో ప్లాస్టిక్‌ పూర్తిగా నిషేధం

పర్యావరణ పరిరక్షణలో భాగంగా శ్రీశైలంలో ఆలయ పరిధిలో పూర్తిస్థాయిలో ప్లాస్టిక్‌ నిషేధం విధించారు. దుకాణదారులు ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్స్‌, ప్లాస్టిక్‌ కవర్లను విక్రయించకూడదని ఆలయ ఈవో డి.పెద్దిరాజు ఆదేశాలు జారీ చేశారు.  ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా కాగితం, జూట్‌ సంచులు వినియోగించాలని సూచించారు.  శ్రీశైల మహాక్షేత్రాన్ని ప్లాస్టిక్‌ రహిత క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా పెద్దిరాజు తెలిపారు.  

ప్లాస్టిక్‌ నిషేధంపై దేవస్థానానికి సహకరించాల్సిందిగా స్థానికులు, స్థానిక వ్యాపారులు, హోటల్‌ నిర్వాహకులు, సత్రాల నిర్వాహకులను కోరారు. వాటర్‌ బాటిల్స్‌ నిషేధంతో భక్తుల ఇక్కట్లు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  కాగా ఇప్పటికే ఏపీ ప్రభుత్వం సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం విధించగా.. ప్లాస్టిక్ నిషేధాన్ని మరింత కఠినంగా అమలు చేసేలా అధికారులు నిర్ణయించారు.

Also Read:కోవీషీల్డ్ వ్యాక్సిన్తో హెల్త్ రిస్క్: సుప్రీంకోర్టులో లాయర్ పిటిషన్