
జీడిమెట్ల/శామీర్ పేట/గండిపేట, వెలుగు: పేట్‌బషీరాబాద్ లో సోమవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అక్కడి మైసమ్మగూడలోని ఓ ప్లాస్టిక్స్రాప్గోదాం దగ్ధమైంది. కిరణ్అగర్వాల్అనే వ్యాపారి ప్లాస్టిక్ వేస్టేజ్తోపాటు వైర్లు ఇతర సామాగ్రిని ఎలాంటి జాగ్రత్తలు లేకుండా గోదాంలో డంప్చేస్తోంది.
సోమవారం మధ్యాహ్నం గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్లాస్టిక్వేస్ట్తగలబడి భారీ మంటలతోపాటు దట్టమైన పొగలు వెలువడ్డాయి. చుట్టుపక్కల అపార్ట్‌మెంట్‌వాసులు పొగతో ఉక్కిరిబిక్కిరయ్యారు. సమాచారం అందుకున్న జీడిమెట్ల అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మూడు గంటల పాటు శ్రమించి మంటలను ఆర్పివేశారు.
అప్పటికే గోదాం మొత్తం కాలి బూడిదైంది. ఎస్సై మహేశ్వర్‌రెడ్డి కేసు నమోదు చేశారు. అలాగే నార్సింగి పీఎస్పరిధి పుప్పాలగూడలోని ఓ ఫర్నిచర్గోదాంలో సోమవారం మంటలు చెలరేగాయి. వట్టినాగులపల్లి, లంగర్‌హౌస్ అగ్నిమాపక సిబ్బందికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సమీపంలోని అపార్ట్‌మెంట్ వాసులు భయబ్రాంతులకు గురయ్యారు. షార్ట్సర్క్యూట్కారణంగా ప్రమాదం జరిగిందని తెలిసింది.
పోతాయిపల్లిలో సిలిండర్ పేలి ఇల్లు..
శామీర్ పేట మండలం పోతాయిపల్లిలోని తీగుళ్ల గోపాల్ కు చెందిన రేకుల ఇంట్లో ముగ్గురు బిహారీలు అద్దెకు ఉంటున్నారు. సోమవారం రాత్రి 7.30 గంటలకు టీ పెడుతుండగా ఒక్కసారిగా వంట గ్యాస్ సిలిండర్ పేలింది. మంటలు అంటుకుని ఇల్లు కాలిబూడిదైంది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. బిహారీలు అనుమతి లేకుండా అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేసి అమ్ముతున్నారని పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు తెలిపారు.