ఎంజీఎంకు ప్లాటినమ్‌‌ స్టేటస్‌‌ అవార్డు

వరంగల్​సిటీ, వెలుగు : వరంగల్‌‌ ఎంజీఎం హాస్పిటల్‌‌కు ప్లాటినమ్‌‌ స్టేటస్‌‌ అవార్డు దక్కింది. రోగులకు ఉత్తమ సేవలు అందించడంతో పాటు, బ్రెయిన్‌‌ స్ట్రోక్‌‌, త్రోంబిలైటిక్‌‌ థెరపీ ద్వారా అనేక మంది ప్రాణాలు కాపాడినందుకు వరల్డ్‌‌ స్ట్రోక్‌‌ ఆర్గనైజేషన్‌‌ ఈ అవార్డును ప్రకటించిందని ఎంజీఎం సూపరింటెండెంట్‌‌ చంద్రశేఖర్‌‌ చెప్పారు.