IND vs ENG: ప్లేయర్లు పెవిలియన్‌కు.. ఆగిపోయిన భారత్, ఇంగ్లాండ్ మ్యాచ్

IND vs ENG: ప్లేయర్లు పెవిలియన్‌కు.. ఆగిపోయిన భారత్, ఇంగ్లాండ్ మ్యాచ్

కటక్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో వన్డేలో మ్యాచ్ కు అంతరాయం కలిగింది. ఫ్లడ్ లైట్ల సమస్య కారణంగా మ్యాచ్ ఆగిపోయింది. దీంతో మ్యాచ్ కు అంపైర్లు ఇన్నింగ్స్ కు బ్రేక్ ఇచ్చారు. భారత్ ఇన్నింగ్స్ ఏడో ఓవర్ లో ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ సకిబ్ మహమూద్ తొలి బంతిని వేయడానికి ముందు లైట్లు ఆరిపోయాయి. ఆ తర్వాత కొంత సేపటికీ అంతా సెట్ అయింది. తొలి బంతికి గిల్ సింగిల్ తీశాడు. అయితే రెండో బంతిని వేయడానికి ముందు మరోసారి ఫ్లడ్‌లైట్లు ఆరిపోయాయి. ఎంతసేపటికీ లైట్లు వెలగకపోవడంతో ఆటగాళ్లు పెవిలియన్ కు చేరాల్సి వచ్చింది. 

రోహిత్ చాలా సేపు అంపైర్ కు ఏదో చెబుతూ తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఈ ఘటనతో పాటు స్టేడియంలో ఉన్న ఫ్యాన్స్ తో పాటు టీమిండియా ఓపెనర్లు గిల్, రోహిత్‌లు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఫ్యాన్స్ ఫోన్ టార్చర్ లు వేస్తూ కాసేపు సందడి చేస్తూ కనిపించారు. ఈ మ్యాచ్ లో 305 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కు ఓపెనర్లు గిల్, రోహిత్ శర్మ మంచి ఆరంభం ఇచ్చారు. ప్రస్తుతం 6.1 ఓవర్లలో వికెట్లేమీ కోల్పోకుండా 48 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 18 బంతుల్లో 3 సిక్సులు, ఒక ఫోర్ తో 29 పరుగులు చేసి మంచి టచ్ లో కనిపిస్తున్నాడు. గిల్ 19 బంతుల్లో 3 ఫోర్లతో 17 పరుగులు చేశాడు.

అంతకముందు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ తీసుకున్న ఇంగ్లాండ్.. బ్యాటర్లు అందరూ సమిష్టిగా రాణించడంతో 49.5  ఓవర్లలో 304 పరుగులకు ఆలౌట్ అయింది. స్టార్ బ్యాటర్ జో రూట్ 69 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. సాల్ట్(26), డకెట్(65) తొలి  వికెట్ కు మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. భారత బౌలర్లలో  జడేజా 3 వికెట్లు తీసుకున్నాడు. వరుణ్ చక్రవర్తి, హార్దిక్ పాండ్య,హర్షిత్ రాణా, మహమ్మద్ షమీ తలో వికెట్ పడగొట్టారు.