చెన్నై: సెకండ్ టెస్ట్‌లో ఫస్ట్ డే ఆటలో థర్డ్ అంపైర్ అనిల్ చౌదరి ఇచ్చిన డీఆర్‌ఎస్ నిర్ణయం తప్పని తేలింది. క్యాచ్ ఔట్ కోసం డీఆర్‌ఎస్ కోరితే అతను ఎల్బీ కోసం రివ్యూ చేశాడు. 75వ ఓవర్‌లో లీచ్ వేసిన బాల్.. రహానె గ్లోవ్స్‌ను తాకుతూ షార్ట్ లెగ్‌లో పోప్ చేతుల్లోకి వెళ్లింది. క్యాచ్ ఔట్ అప్పీల్‌ను ఆన్‌ఫీల్డ్ అంపైర్ తిరస్కరించడంతో ఇంగ్లండ్ రివ్యూకు వెళ్లింది. అయితే ఎల్బీ కోసం అప్పీల్ చేశారనే భావనతో థర్డ్ అంపైర్ అనిల్ రీప్లే చూడటం మొదలుపెట్టాడు. బాల్ ఔట్‌సైడ్ లెగ్ స్టంప్‌పై పడటంతో ఇంగ్లిష్ టీమ్ రివ్యూను రిజెక్ట్ చేశాడు. దీన్ని బిగ్‌స్క్రీన్‌పై చూసిన రూట్ తాము క్యాచ్ ఔట్ కోసం రివ్యూకు వెళ్లిన విషయాన్ని ఫీల్డ్ అంపైర్లకు గుర్తు చేశాడు. థర్డ్ అంపైర్ తప్పిదాన్ని గుర్తించిన మ్యాచ్ రిఫరీ.. రూల్స్ ప్రకారం ఓ రివ్యూను ఇంగ్లండ్ ఖాతాలో రీస్టోర్ చేశాడు.
For More News..