
- పరిగి ప్రీమియర్ లీగ్‌లో ఘటన ఆలస్యంగా వెలుగులోకి..
పరిగి, వెలుగు: క్రికెట్ టోర్నీలో మ్యాచ్‌ఫిక్సింగ్‌కు అంగీకరించని ప్లేయర్‌పై కొందరు దాడికి తెగబడ్డారు. వికారాబాద్ జిల్లా పరిగి మినీ స్టేడియంలో కొద్దిరోజులుగా పరిగి ప్రీమియర్ లీగ్ (పీపీఎల్) పేరిట క్రికెట్ టోర్నీ నిర్వహిస్తున్నారు. గ్రౌండ్లో కొంతమంది నేరుగా ఆటను చూస్తూనే బెట్టింగులు చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఇందుకోసం 1X బెట్టింగ్ యాప్ వాడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఈ నెల 12న శనివారం రాత్రి బెట్టింగ్ వ్యవహారమై ఒక టీం ప్లేయర్, యజమాని మధ్య గొడవ జరిగింది.
1X లో బెట్టింగ్ చేసి ఓడిపోవాలని నిర్వాహకుడు తన ఆటగాళ్లకు సూచించగా, ఇందుకు మన్నన్ అనే యువకుడు నిరాకరించాడు. బ్యాటింగ్‌లో ఔట్ కావాలని చెప్పగా, ఒప్పుకోలేదు. దీంతో మ్యాచ్ అయ్యాక తనపై దాడి చేశారని బాధితుడు ఆరోపించారు. తల, భూజానికి గాయాలు కావడంతో ఆదివారం పరిగి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పరిగి ఎస్ఐ సంతోష్ కుమార్ సోమవారం తెలిపారు.