భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ తుది అంకానికి చేరుకుంది. ఈ మెగా టోర్నీలో ఇక మిగిలింది.. ఫైనల్ మ్యాచే. ఆదివారం(నవంబర్ 19) గుజరాత్‌లోని అహ్మదాబాద్ గడ్డపై టైటిల్ కోసం ఆతిథ్య భారత్, ఆస్ట్రేలియా జట్లు అమీతుమీ తేల్చుకోనునున్నాయి. ఈ తరుణంలో ఇప్పటివరకూ ఈ మోగా టోర్నీలో దంచికొట్టిన మొనగాళ్ల పేర్లను 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' అవార్డు నామినీస్ లిస్టును ఐసీసీ శనివారం వెల్లడించింది.
'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' అవార్డుకు మొత్తం తొమ్మిది మంది క్రికెటర్లు నామినేట్ అవ్వగా, ఇందులో భారత క్రికెటర్లు నలుగురు చోటు సంపాదించారు. వీరిలో మీకు నచ్చిన క్రికెటర్‌కు ఓటు వేయవచ్చు. నామినేట్ అయిన వారు ఎవరెవరు..? ఎలా ఓటేయాలి..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
వరల్డ్ కప్ మెగా టోర్నీలో భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న విరాట్ కోహ్లీ, మహమ్మద్ షమీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రాలు పోటీ పడుతున్నారు. వీరితో పాటు ఆస్ట్రేలియా జట్టు నుంచి మ్యాక్స్‌వెల్, ఆడమ్ జంపా.. న్యూజిలాండ్ నుంచి రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్.. సౌతాఫ్రికా క్రికెటర్ డికాక్ పోటీలో ఉన్నారు.
ఓటింగ్ ద్వారానే విజేత ప్రకటన
విజేతను నిర్ణయిచేందుకు ఐసీసీ ఓటింగ్ నిర్వహిస్తోంది. ఇందులో ఎవరికి ఎక్కువ ఓట్లు పోలవుతాయో ఆ క్రికెటర్‌ను ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా ప్రకటిస్తుంది. భారత్ నుంచి నలుగురు పోటీలో ఉన్నారు కనుక స్ప్లిట్ అవ్వకుండా ఓటు వేయగలరు. ఓటేయాలంటే లాగిన్ అవ్వాలి.. సమయం వృథా అనుకోకండి.. మీ ఒక్క ఓటు కూడా విజేతను మార్చవచ్చు. తప్పనిసరిగా ఈ ఓటింగ్‌లో పాల్గొనండి.
- ఓటు వేయడం కోసం ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ లింక్ పై క్లిక్ చేయండి.
అగ్రస్థానంలో కోహ్లీ
ఇప్పటివరకూ ఈ టోర్నీలో 10 మ్యాచ్ ల్లో 711 పరుగులతో కోహ్లీ టాప్ స్కోరర్‌గా కొనసాగుతుండగా.. ఆ తర్వాతి స్థానాల్లో డికాక్ (594), రచిన్ రవీంద్ర (578), మిచెల్ (552), రోహిత్ శర్మ (550) ఉన్నారు. ఇక అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో షమీ (6 మ్యాచ్ ల్లో 23 వికెట్లు) టాప్ ప్లేస్‌లో ఉండగా.. ఆ తర్వాత ఆడమ్ జంపా(10 మ్యాచ్ ల్లో 22 వికెట్లు) రెండో స్థానంలో ఉన్నాడు.