
ముంబై: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సూచన మేరకు బీసీసీఐ రూపొందించిన 10 పాయింట్ల క్రమశిక్షణా మార్గదర్శకాలలోని కొన్ని నిబంధనల గురించి ఆటగాళ్లు అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియాతో కెప్టెన్ చర్చించనున్నారు. ఈ గైడ్‌లైన్స్ బీసీసీఐ అధికారికంగా ప్రకటించలేదు. వీటిపై అధికారిక ప్రకటన వచ్చాక మాట్లాడుతానంటూనే ఫారిన్ టూర్స్‌లో ప్లేయర్ల ఫ్యామిలీ మెంబర్స్‌ను రెండు వారాలే అనుమతించాలన్న నిబంధనపై అసహనం వ్యక్తం చేస్తూ కొందరు ప్లేయర్లు తనకు చెబుతున్నారని పరోక్షంగా రోహిత్ తెలిపాడు.