PBKS vs RCB: సొంతగడ్డపై బెంగళూరు మ్యాచ్.. 11 కోట్ల ఆటగాడిపై వేటు

PBKS vs RCB: సొంతగడ్డపై బెంగళూరు మ్యాచ్.. 11 కోట్ల ఆటగాడిపై వేటు

ఐపీఎల్ లో భాగంగా అన్ని జట్లు ఒక మ్యాచ్ ఆడేశాయి. ఇప్పటివరకు 5 మ్యాచ్ లు జరిగితే 10 జట్లు లీగ్ లో తమ మొదటి మ్యాచ్ ను పూర్తి చేసుకున్నాయి. జరిగిన 5 మ్యాచ్ ల్లో సొంతగడ్డపై ఆడిన జట్లే విజయం సాధించాయి. చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్,రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ ఈ టోర్నీలో బోణీ కొట్టాయి. నేటి నుంచి అన్ని జట్లు రెండో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాయి.  ఇందులో భాగంగా నేడు (మార్చి 25) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పంజాబ్ కింగ్స్ తో తలపడుతుంది. 

పంజాబ్ ఇప్పటికే సొంతగడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్ పై విజయం సాధించగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిధ్యమిస్తుంది. తొలి మ్యాచ్ లో ఓడిపోయిన ఆర్సీబీ నేడు (మార్చి 25) సొంతగడ్డపై విజయం సాధించాలని ఆ జట్టు కోరుకుంటుంది. ఇందులో భాగంగా తుది జట్టులో బెంగళూరు ఒక మార్పు చేయడం ఖాయంగా కనిపిస్తుంది. రూ. 11 కోట్లు భారీ ధరకు దక్కించుకున్న వెస్టిండీస్ పేసర్ అల్జారీ జోసెఫ్ తొలి మ్యాచ్ లో విఫలమయ్యాడు. 

3.4 ఓవర్లలో 38 పరుగులిచ్చి ఒక వికెట్ కూడా తీసుకోలేకపోయాడు. దీంతో ఇతని స్థానంలో నేడు న్యూజిలాండ్ స్పిన్న లాకీ ఫెర్గుసన్ తుది జట్టులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు తొలి మ్యాచ్ లో పెద్దగా ప్రభావం చూపని కరణ్ శర్మ స్థానంలో  ఫాస్ట్ బౌలర్ విజయ్ కుమార్ వైశుక్ ప్లేయింగ్ 11 లో చోటు దక్కొచ్చు. ఈ రెండు మార్పులు మినహా ఆర్సీబీ పెద్దగా మార్పులు చేయకపోవచ్చు. మరోవైపు తొలి మ్యాచ్ లో గెలిచిన పంజాబ్ తుది జట్టులో మార్పులు చేయకపోవచ్చు. ఇటూ జట్ల మధ్య ఇప్పటివరకు 31 మ్యాచ్ లు జరిగితే ఆర్సీబీ 14 మ్యాచ్ ల్లో విజయం సాధించగా.. పంజాబ్ 17 మ్యాచ్ ల్లో నెగ్గింది. చివరి 5 మ్యాచ్ లు చూసుకుంటే పంజాబ్ 5 మ్యాచ్ ల్లో విజయం సాధించింది.      

బెంగళూరు తుది జట్టు (అంచనా ):

ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్ (వికెట్ కీపర్), విజయ్ కుమార్ వైశుక్, లాకీ ఫెర్గుసన్ , మయాంక్ డాగర్, మహ్మద్ సిరాజ్

పంజాబ్ తుది జట్టు (అంచనా ):

శిఖర్ ధావన్ (కెప్టెన్ ), జానీ బెయిర్‌స్టో, సామ్ కర్రాన్, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), శశాంక్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్