-
ఐటీ మంత్రి శ్రీధర్ బాబు
సికింద్రాబాద్,వెలుగు: ప్రస్తుత కాలంలో పెరిగిన ప్లాస్టిక్వాడకంతో పర్యావరణానికి ముప్పు కలుగుతుందని, ఇకముందు ప్లాస్టిక్వాడకంపై తగు జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. సింగిల్యూజ్ప్లాస్టిక్పై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.
హైదరాబాద్ తార్నాకలోని ఐఐసీటీలో శుక్రవారం గ్రీన్ వర్క్స్ బయో ఆధ్వర్యంలో ఏర్పాటైన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్రత్యామ్నాయ పాలిమర్స్ ఆవిష్కరణ కార్యక్రమానికి మంత్రి జరై మాట్లాడారు. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన భవిష్యత్ కు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. గ్రీనరీ వైపుగా సరికొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
సైంటిస్టులు పరిశోధనల ద్వారా పర్యావరణ పరిరక్షణ ఉత్పత్తులను అందించాలని సూచించారు. కార్యక్రమంలో గ్రీన్ వర్క్ డైరెక్టర్ రిషికా రెడ్డి, ఐఐసీటీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, పెట్రో కెమికల్ ఇంజినీరింగ్ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ జనరల్ ప్రొ.శిశిర్ సిన్హ, అపోలో హాస్పిటల్స్ గ్రూప్స్ జాయింట్ ఎండీ సంగీతా రెడ్డి, పద్మజా పాలిమర్స్ ఎండీ పద్మజారెడ్డి పాల్గొన్నారు.