![సారూ ప్రాణాలు పోతున్నాయి... స్పీడ్‌బ్రేకర్ ఏర్పాటు చేయండి..](https://static.v6velugu.com/uploads/2025/02/please-build-speed-breakers-shameerpeta-collecorate-route_0yh763weKz.jpg)
ఆ రోడ్డు మృత్యు రహదారిగా మారింది. ఇక్కడ వాహనాలు స్పీడుగా వస్తున్నాయి.. స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేయండి.. ప్రజలు నెత్తీ..నోరు మొత్తుకున్నా..అధికారులకు పట్టడం లేదు. పైగా అక్కడే బస్ స్టాప్ కూడా ఉంది. నిత్యం ఆఫీసులకు.. కాలేజీలకు వెళ్లే వారు బస్సుల కోసం పడిగాపులు కాస్తుంటారు. ఇంత రద్దీగా ఉన్న రహదారి గురించి అధికారులు పట్టించుకోకపోవడంతో స్థానికులు ఆందోళనకు దిగారు.. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే....
కీసర.. శామీర్‌పేట కలెక్టరేట్ చౌరస్తా సమీపంలోకి బస్ స్టాపు వద్ద రహదారిపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రైవేట్ వాహనాలు స్పీడుగా దూసుకెళ్లడంతో.. ఇక్కడ అనేక ప్రమాదాలు జరుగుతన్నాయి. ఇక్కడ స్పీడ్‌బ్రేకర్ ఏర్పాటు చేయాల్సిందిగా అధికారులకు స్థానికులు అనేకసార్లు విన్నవించుకున్నారు.
బస్సు కోసం వెయిట్ చేస్తున్న అంతాయిపల్లి గ్రామానికి చెందిన గాయత్రి(21), భవానీ(21)లను రెడీమిక్స్ వాహనం ఢీకొట్టడంతో పరిస్థితి విషమంగా మారింది. కీసర శామీర్ పేట రహదారి కలెక్టరేట్ చౌరస్తా వద్ద ఈ సంఘటన చోటు చేసుకోవడంతో గ్రామస్తులు ... ఆగ్రహంతో టైర్లు తగలబెట్టి నిరసన తెలిపారు. మూడు రోజుల క్రితం అంతాయిపల్లి గ్రామానికి చెందిన బత్తుల పెంటయ్య మృతి చెందిన సంఘటన మరువకముందే అదే గ్రామానికి చెందిన గాయత్రి,భవానీలు పనికి వెళ్తుండగా రోడ్డు వద్ద నిలబడి ఉన్న సమయంలో శామీర్ పేట వైపునకు వెళుతున్న రెడీమిక్స్ వాహనం వీరిని ఢీకొట్టింది. కలెక్టరేట్ కు వెళ్లే దారిలో ప్రజల ప్రాణాలను ఎందుకు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కలెక్టరేట్ చౌరస్తా వద్ద రెడీమిక్స్ ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపై ఆసుపత్రి పాలయ్యారు మార్గంలో పోతున్న కనీసం స్పీడ్ బ్రేకర్లు వేయడం లేదని సీసీ కెమెరాలు వెలగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులను వెళ్లి మార్గంలో స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి... సామాన్యులు వెళ్లే దారిలో ప్రమాదాలు నివారించేందుకు స్పీడ్ బ్రేకర్లు ఎందుకు ఏర్పాటు చేయడం లేదని కలెక్టర్ పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.