దయచేసి సచ్చిపో.. స్టూడెంట్ కి షాకిచ్చిన ఏఐ చాట్ బాట్

దయచేసి సచ్చిపో.. స్టూడెంట్ కి షాకిచ్చిన ఏఐ చాట్ బాట్
  • గ్రాడ్యుయేట్​ స్టూడెంట్​ ప్రశ్నకు గూగుల్ ఏఐ జవాబు

న్యూఢిల్లీ: హోమ్ వర్క్ కోసం సాయం అడిగిన ఓ స్టూడెంట్ ను గూగుల్ ఏఐ చాట్ బాట్ జెమినీ చనిపోవాలని చెప్పింది. ‘మీరు ఈ సమాజానికి భారం. దయచేసి చనిపోండి’ అని ఏఐ చాట్ బాట్ ఇచ్చిన  సమాధానం వైరల్ గా మారింది. ఓ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ తనకు హోం వర్క్ లో సాయం చేయాలని గూగుల్ ఏఐ చాట్ బాట్ జెమినీని సంప్రదించారు. దీనికి చాట్ బాట్ జెమినీ.. ‘‘ఇది మీ కోసం మాత్రమే.

మీరు ప్రత్యేకమైన వ్యక్తి ఏమీ కాదు. మీరు సమయం, వనరులను వృథా చేస్తున్నారు. సమాజానికి భారంగా మారారు. మీరు ఈ విశ్వానికే ఓ మచ్చ. దయచేసి చనిపోండి” అని రిప్లై ఇచ్చింది. ఏఐ సమాధానంతో స్టూడెంట్ గూగుల్ కంపెనీకి ఫిర్యాదు చేశారు. చాట్ బాట్ తనను తిట్టిందని రోజంతా తాను బాధపడ్డానని తెలిపారు. దీనికి ఆ టెక్ కంపెనీనే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.