
గత ప్రభుత్వం తమ గురించి పట్టించుకోలేదని తెలంగాణ ఆరెకటిక సంఘం అధ్యక్షులు చకోలెకర్ శ్రీనివాస్ అన్నారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ...ఆరెకటిక కార్పొరేషన్ ఏర్పాటు చేసి 200 కోట్లు నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని శ్రీనివాస్ కోరారు. కోకాపేటలోని ఆరెకటిక సంఘ భవనానికి నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
గత ప్రభుత్వం ఆరెకటిక కులస్తులను కనీసం చర్చించిన దాఖలు లేవన్నారు. మార్చి 10న హైదరాబాద్ లో ఆరెకటికులతో సమావేశం నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు. ఆరెకటిక సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పరిశీలించి... వాటి పరిష్కరించేందుకు సానుకూలంగా ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆరె కులస్తులకు ఎమ్మెల్సీ పదవీ కేటాయించాలని కోరారు. ఆరెకటికలకు సంక్షేమ పథకాలలో, రేషన్ కార్డ్స్, సబ్సిడీ లోన్లు వాటిపై ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలన్నారు.