భూ సమస్యల పరిష్కారానికి  సహకరించాలి  

భూ సమస్యల పరిష్కారానికి  సహకరించాలి  
  •  రైతులతో  వికారాబాద్ కలెక్టర్ 


పరిగి, వెలుగు: భూ సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సూచించారు. కులకచర్ల మండలం అల్మాస్కాన్ పేటలో స్థానిక రైతులతో గురువారం వారు సమావేశమయ్యారు. రైతు సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుందన్నారు. భూ సమస్యల పరిష్కారానికి అందరూ సహకరించాలని కోరారు. అధికారుల రికార్డుల ప్రకారం అల్మాస్కాన్ పేటలో 1,054 ఎకరాల భూమి ఉందన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, మండల మాజీ ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు.