నీట్– పీజీ అభ్యర్థులకు న్యాయం చేయాలి

నీట్– పీజీ అభ్యర్థులకు న్యాయం చేయాలి
  •     కేంద్ర ప్రభుత్వానికి డాక్టర్ వెంకటేశ్​ కుమార్ దుర్గం విజ్ఞప్తి

ఖైరతాబాద్, వెలుగు: మెడికల్ కౌన్సిల్ కమిటీ నిర్లక్ష్యంతో కోరుకున్న బ్రాంచ్ లో చేరే అవకాశం కోల్పోయిన నీట్- పీజీ-2024 అభ్యర్థులకు ప్రత్యేక కౌన్సిలింగ్ ను నిర్వహించాలని గాంధీ హాస్పిటల్​ డాక్టర్ వెంకటేశ్​ కుమార్ దుర్గం మెడికల్ కౌన్సిల్ కమిటీ, నేషనల్ మెడికల్ కౌన్సిల్, ప్రధాని నరేంద్ర మోదీని విజ్ఞప్తి చేశారు. 

సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కౌన్సిలింగ్ ప్రక్రియ సక్రమంగా సాగకపోవడంతో గందరగోళం నెలకొందన్నారు. కౌన్సిలింగ్ ఆల్ ఇండియా లెవెల్ లో మొదటి రౌండ్ పూర్తి అయిన తర్వాత స్టేట్ రౌండ్స్ కొనసాగుతాయని అన్నారు. మధ్యప్రదేశ్, అస్సోం రాష్ట్రాల్లో స్టేట్ రౌండ్ పూర్తికాకముందే ఆల్ ఇండియా లెవల్ లో మూడో రౌండ్ నిర్వహించారన్నారు. దీంతో కోరుకున్న బ్రాంచ్​కాకుండా ఇతర బ్రాంచ్ లలో చేరాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.