- మాలల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు బేర బాలకిషన్
ఇబ్రహీంపట్నం, వెలుగు: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో డిసెంబర్ 1న తలపెట్టిన మాలల సింహ గర్జన బహిరంగ సభను విజయవంతం చేయాలని తెలంగాణ మాలల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు బేర బాలకిషన్ కోరారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడా చౌరస్తాలో అంబేద్కర్ యువజన సంఘం వద్ద సభ వాల్ పోస్టర్ను బుధవారం ఆయన ఆవిష్కరించారు.
మహేశ్వరం నియోజకవర్గం నుంచి వేలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా సభకు హాజరు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం తుక్కుగూడలో మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి చ్చన్నగారి లక్ష్మారెడ్డిని తెలంగాణ మాలల ఐక్యవేదిక నాయకులు కలిసి కరపత్రం అందజేశారు. కార్యక్రమంలో మహేశ్వరం మాజీ మండల పరిషత్ అధ్యక్షుడు పెంట మల్ల స్నేహ సురేశ్, మాల సంఘాల నాయకులు బేగరి యాదగిరి, మహేందర్, ఏకుల రాములు, రాజేశ్, కుమార్, పెండ్యాల బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.