
- ఉప్పల్ జీహెచ్ఎంసీ ఆఫీస్ ఎదుట మహిళ ఆందోళన
ఉప్పల్, వెలుగు : తనకు, తన పిల్లలకు ఆధార్ కార్డు ఇవ్వకుండా తిప్పించుకుంటున్నారని, వెంటనే ఆధార్ కార్డు ఇవ్వాలంటూ ఓ మహిళ తన నలుగురు పిల్లలతో కలిసి ఉప్పల్ జీహెచ్ఎంసీ ఆఫీస్ ఎదుట రోడ్డుపై బైఠాయించింది. పనికి వెళ్లినా, పిల్లలను స్కూల్ లో చేర్పించాలన్నా ఆధార్ కార్డు అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఎన్నిసార్లు ఆఫీస్ చుట్టూ తిరిగినా ఇవ్వడం లేదని వాపోయింది. దీంతో అధికారులు ఆమె దగ్గరకు వచ్చి ఆధార్ తీయిస్తామని హామీ ఇవ్వడంతో వెళ్లిపోయింది. జీహెచ్ఎంసీ అధికారులు మాట్లాడుతూ వారికి అడ్రస్ ప్రూఫ్ లేనందున ఇవ్వలేకపోయామన్నారు.