ఎన్‌‌‌‌‌‌‌‌కౌంటర్‌‌‌‌‌‌‌‌లో పీఎల్‌‌‌‌‌‌‌‌జీఏ కమాండర్‌‌‌‌‌‌‌‌ మడవి జోగా మృతి

ఎన్‌‌‌‌‌‌‌‌కౌంటర్‌‌‌‌‌‌‌‌లో పీఎల్‌‌‌‌‌‌‌‌జీఏ కమాండర్‌‌‌‌‌‌‌‌ మడవి జోగా మృతి
  •    బస్తర్‌‌‌‌‌‌‌‌ ఐజీ సుందర్‌‌‌‌‌‌‌‌రాజ్‌‌‌‌‌‌‌‌ ప్రకటన

భద్రాచలం, వెలుగు : చత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌ రాష్ట్రంలోని బీజాపూర్‌‌‌‌‌‌‌‌ జిల్లా పామేడు పోలీస్‌‌‌‌‌‌‌‌స్టేషన్‌‌‌‌‌‌‌‌ పరిధిలో శుక్రవారం జరిగిన ఎన్‌‌‌‌‌‌‌‌కౌంటర్‌‌‌‌‌‌‌‌లో పీఎల్‌‌‌‌‌‌‌‌జీఏ కమాండర్‌‌‌‌‌‌‌‌ మడవి జోగా చనిపోయినట్లు బస్తర్‌‌‌‌‌‌‌‌ ఐజీ సుందర్‌‌‌‌‌‌‌‌రాజ్‌‌‌‌‌‌‌‌ ప్రకటించారు. శనివారం బీజాపూర్‌‌‌‌‌‌‌‌లో మీడియాతో మాట్లాడారు. ఊసూర్, పామేడు, బాసగూడ, తెర్రం అడవుల్లో కమాండర్లు విజ్జా, దేవా, జోగాతో పాటు 40 మంది మావోయిస్ట్‌‌‌‌‌‌‌‌లు సమావేశం అయ్యారని సమాచారం అందడంతో శుక్రవారం కోబ్రా, డీఆర్జీ బలగాలు కూంబింగ్‌‌‌‌‌‌‌‌కు వెళ్లాయి. ఈ టైంలో పీఎల్‌‌‌‌‌‌‌‌జీఏ, సీఆర్‌‌‌‌‌‌‌‌సీ మావోయిస్ట్‌‌‌‌‌‌‌‌ బలగాలు ఎదురుపడి కాల్పులు జరిపాయి. పోలీసులు ఎదురుకాల్పులు జరపడంతో ముగ్గురు మావోయిస్టులు చనిపోగా మిగిలిన వారు పారిపోయారు. మావోయిస్ట్‌‌‌‌‌‌‌‌ల మృతదేహాలు, ఆయుధాలను బీజాపూర్‌‌‌‌‌‌‌‌కు తరలించి విచారించగా మృతుల్లో మడవి జోగా ఉన్నట్లు గుర్తించామని ఐజీ తెలిపారు. అతడిపై రూ. 8 లక్షల రివార్డు ఉందన్నారు. 

ఆరుగురు మావోయిస్ట్‌‌‌‌‌‌‌‌ సానుభూతిపరులు అరెస్ట్‌‌‌‌‌‌‌‌

భద్రాచలం, వెలుగు : ఆరుగురు మావోయిస్ట్‌‌‌‌‌‌‌‌ సానుభూతిపరులను శనివారం పోలీసులు అరెస్ట్‌‌‌‌‌‌‌‌ చేశారు. భద్రాచలం ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి డీఎస్పీ రవీందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... చర్ల పోలీసులు, సీఆర్‌‌‌‌‌‌‌‌పీఎఫ్‌‌‌‌‌‌‌‌ జవాన్లు కలిసి తాలిపేరు డ్యాం సమీపంలో కూంబింగ్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. ఈ టైంలో చర్ల మండలం చెన్నాపురం గ్రామానికి చెందిన మడకం దేవ, సోడి ఉంగ, సోడి కోస, మడకం ఇడ్మా, కలుమ అడుమ, కొవ్వాసి భీమయ్య అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని తనిఖీ చేస్తుండగా ఎలక్ట్రికల్‌‌‌‌‌‌‌‌ వైర్‌‌‌‌‌‌‌‌, ప్రెషర్‌‌‌‌‌‌‌‌ కుక్కర్‌‌‌‌‌‌‌‌ దొరికింది. పూర్తిస్థాయిలో విచారించగా మావోయిస్ట్‌‌‌‌‌‌‌‌  సానుభూతిపరులుగా పనిచేస్తున్నట్లు తేలింది. ప్రెషర్‌‌‌‌‌‌‌‌ కుక్కర్‌‌‌‌‌‌‌‌ బాంబును అమర్చి బలగాలను హతమార్చేందుకు ప్లాన్‌‌‌‌‌‌‌‌  చేసినట్లు తేలింది.