కరెంట్ సప్లయ్‌‌‌‌ పరికరాల కోసం పీఎల్‌‌‌‌ఐ!

కరెంట్ సప్లయ్‌‌‌‌ పరికరాల కోసం పీఎల్‌‌‌‌ఐ!

న్యూఢిల్లీ: కరెంట్‌‌‌‌ సప్లయ్‌‌‌‌లో వాడే ఎక్విప్‌‌‌‌మెంట్ల తయారీని ప్రోత్సహించేందుకు ప్రొడక్షన్ లింక్డ్‌‌‌‌ ఇన్వెంటివ్‌‌‌‌ (పీఎల్‌‌‌‌ఐ) స్కీమ్‌‌‌‌ను  కేంద్రం లాంచ్ చేయాలని చూస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరిలోపు ఈ స్కీమ్‌‌‌‌ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.  ట్రాన్స్‌‌‌‌ఫార్మర్లు, సర్క్యూట్‌‌‌‌ బ్రేకర్లు, స్విచ్‌‌‌‌గేర్లతో సహా వివిధ పవర్ ట్రాన్స్‌‌‌‌మిషన్‌‌‌‌ ఎక్విప్‌‌‌‌మెంట్లను దిగుమతి చేసుకోవడానికి ఇండియా భారీగా ఖర్చు చేస్తోంది. 

కిందటేడాది  338 మిలియన్ డాలర్ల విలువైన పవర్  ట్రాన్స్‌‌‌‌మిషన్ పరికరాలను దిగుమతి చేసుకుందని అంచనా. ఇందులో 124 మిలియన్ డాలర్ల పరికరాలను ఒక్క చైనా నుంచే దిగుమతి చేసుకుంది. ‘ ట్రాన్స్‌‌‌‌మిషన్ పరికరాల తయారీని లోకల్‌‌‌‌గా పెంచేందుకు  పీఎల్‌‌‌‌ఐ స్కీమ్‌‌‌‌ను అమలు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ  పవర్ మినిస్ట్రీకి ఈ నెల 1 న  ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరిలోపు ఈ స్కీమ్‌‌‌‌ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది’ అని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. సప్లయ్ చెయిన్‌‌‌‌ను బలోపేతం చేసేందుకు వివిధ ఆప్షన్లను ప్రభుత్వం చూస్తోందని అన్నారు.