ప్లాట్ల సమస్యలను మూడు రోజుల్లో పరిష్కరించాలి

జనగామ, వెలుగు : జనగామ పట్టణంలోని మల్లన్నగుడి వద్ద దొడ్డికొమురయ్య నగర్‌‌లోని 400, 401 సర్వే నంబర్‌‌లో ఉన్న ప్లాట్ల సమస్యలను మూడు రోజుల్లో పరిష్కరించాలని పలువురు డిమాండ్‌‌ చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ పట్టణంలోని అల్లాడి మోహన్‌‌రావు, ఈశ్వర్‌‌రావుకు చెందిన ప్లాట్లను 23 ఏళ్ల కింద కొనుగోలు చేశామని, వాటికి పొజిషన్‌‌ చూపించాలని వారం రోజులుగా నిరసన దీక్షలు చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

తాము కొనుగోలు చేసిన ప్లాట్లలో తన భూమి ఉందంటూ నిమ్మతి శ్రీనివాస్‌‌రెడ్డి అనే వ్యక్తి ఇబ్బంది పెడుతున్నారన్నారు. ప్లాట్లు అమ్మిన మోహన్‌‌రావు, ఈశ్వర్‌‌రావు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు. వీరికి సీపీఎం పట్టణ కమిటీ, జనగామ రియల్‌‌ ఎస్టేట్‌‌ వ్యాపారుల సంఘం లీడర్లు మద్దతు తెలిపారు.