ప్లాట్లు కబ్జా చేశారు..న్యాయం చేయండి

ప్లాట్లు కబ్జా చేశారు..న్యాయం చేయండి

అబ్దుల్లాపూర్​మెట్​ తహసీల్దార్​ ఆఫీసు ఎదుట బాధితుల ఆందోళన

అబ్దుల్లాపూర్ మెట్, వెలుగు : తమ ప్లాట్లను కబ్జా చేశారని, న్యాయం చేయాలంటూ పలువురు బాధితులు అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ ఆఫీస్​ ఎదుట ఆందోళనలు చేశారు. బాధితుల వివరాల ప్రకారం.. అబ్దుల్లాపూర్ మెట్ మండల పిగ్లీపూర్ లోని నాగేశ్వర్ హౌసింగ్ కార్పొరేషన్(నవదుర్గనగర్ కాలనీ)లో 1200మంది 1985–87 సంవత్సరాల్లో ప్లాట్లు కొన్నారు. కానీ స్థానికంగా ఉన్న కొందరు సదరు భూమిని కబ్జా చేసి, హద్దులు మార్చేశారని ఆరోపించారు. యజమానులమైన తమనే తమ భూమిలోకి రానివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు తీర్పులిచ్చినా.. తమ ప్లాట్లలోకి రానివ్వడం లేదని అన్నారు. తర్వాత తహసీల్దార్ సుదర్శన్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. సర్వే చేసి వారం రోజుల్లో న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. నాగభూషణ్, జయంత్, శివరామకృష్ణ, శారదదేవి, దుర్గ, లక్ష్మీ, త్రిపురంభ, సుబ్బరావు, మార్కండేయ, ఎవీఎన్ వర్మ, శ్రీనివాస్ రావు తదితరులు ఉన్నారు.