మోదీ కా పరివార్..లోక్ సభ ఎన్నికల సమయంలో X సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలో ప్రతి బీజేపీ నేత, కార్యకర్త ప్రొఫైల్ గా దర్శన మి చ్చింది. 2024 లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాని మోదీ.. ప్రతి ఇండియన్ తన సోషల్ మీడియా ఫ్రొఫైల్ లో మోదీ కా పరివార్ జోడించాలని కోరారు. ఈ పిలుపుతో బీజేపీ అగ్రశ్రేణి నేత లతోపాటు బీజేపీ కార్యకర్తలు, మోదీ అంటే అభిమానం ఉన్న ప్రతి ఒక్కరూ మోదీ కా పరివార్ ను సోషల్ మీడియాలో ఫ్రొఫైల్ ట్యాగ్ లైన్ గా పెట్టుకున్నారు. ఎన్నికలు అయిపోయాయి..బీజేపీ అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ‘ఇకచాలు.. మోదీకా పరి వార్ ట్యాగ్ లైన్ తీసేయండి అంటూ ప్రధాని మోదీ X ఫ్లాట్ ఫాం ద్వారా మేసేజ్ చేశారు. మీరు చూపించి ప్రేమ అభిమానాలు ధన్యవాదాలు.. ఇక ట్యాగ్ ను తొలగించండి.. కానీ ప్రేమ అభిమానాలు కొనసాగించండి.. మేం దేశం కోసం పాటు పడతాం అంటూ మేసేజ్ ను పోస్ట్ చేశారు.
‘‘భారత దేశం అంతటా ప్రజలు తమ సోషల్ మీడియాలో నా పట్ల అభిమానాకి గుర్తుగా మోదీకా పరివార్ ని జోడిండి ఎన్నికల్లో ప్రచారం చేశారు. నేను దాని నుంచి ఎంతో బలాన్ని పొందాను. దేశ ప్రజలు వరుసగా మూడోసారి ఎన్డీయే కు మెజారీటీని అం దించారు. ఇది ఒకరకమైన రికార్డు.. దీని ద్వారా దేశ ఉన్నతికి నిరంతర కృషి చేయాలని దేశ ప్రజలు మమ్ములను ఆదే శించారు.’’ అని ప్రధాని మోదీ సోషల్ మీడియా ప్లాట్ ఫాం X లో ఓ పోస్ట్ ను షేర్ చేశారు.
ప్రధాని మోదీ సోషల్ మీడియా మేసేజ్ కు స్పందించిన బీజేపీ అగ్రనేతలతో పాటు షోషల్ మీడియాలో మోదీ పరివారం కూడా మదీకా పరివార్ ట్యాగ్ లైన్ ను తమ సోషల్ మీడియా ఫ్రొఫైల్ లనుంచి తొలగించారు.
మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, గజేంద్ర సింగ్ షెకావత్, అమిత్ మాల్వియా వంటి పలువురు సీనియర్ బీజేపీ నేతలు సోషల్ మీడియాలో మోడీ కా పరివార్ ట్యాగ్ ను తొలగించారు. పీఎంఓ కార్యాలయం సోషల్ మీడియా ప్లాట్ ఫాం X లో కూడా ట్యాగ్ ను కవర్ చిత్రాన్ని కూడా తొలగించారు.
అయితే ప్రతిపక్ష కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ మాత్రమం దీనిపై మరోలా స్పందించారు. ఇదంతా 2024 లోక్ సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ రాజ్యాంగ పరిరక్షణపై దృష్టి ప్రభావం అని అన్నారు.
మోదీ కా పరివార్ ఆలోచన ఎలా వచ్చిందంటే..
2024 మార్చిలో ఆర్ జేడీ నేత లాలూ యాదవ్ ప్రధాని మోదీపై కొన్ని చమత్కారోక్తులు వేశారు. మోదీ కి కుటుంబమే లేదు అని లాలూ అన్న మరుసటి రోజు బీజేపీ సీనియర్ నేతలంగా ప్రధాని సంఘీభావంగా మోదీ కా పరివార్ ట్యాగ్ ని జోడించారు. తెలంగాణలోని ఆదిలాబాద్ లో జరిగి బీజేపీ ర్యాలీలో ఆర్జేడీ నేత లాలూ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు చేశారు బీజేపీఅగ్ర నేతలు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, శివరాజ్ సింగ్ చైహాన్.
దీనిపై ప్రధాని కూడా స్పందిస్తూ ‘‘140 కోట్ల భారతీయులే నా కుటుంబం అని ప్రకటించారు. ఎవరూ లేని వారు మోదీకి చెందినవారు.. మోదీ వారికే చెందుతారు.. నా భారత దేశం .. నా కుటుంబం అని ప్రకటించారు. ఈ క్రమంలో మోదీ కా పరివార్ అని ట్యాగ్ ను దేశ ప్రజలు తమ ప్రొఫైల్ లో పెట్టుకోవాలని పిలుపునిచ్చారు.