ఢిల్లీ: టెక్నాలజీని నైతికంగా వినియోగించడానికి గ్లోబల్ డిజిటల్ ఫ్రేమ్ వర్క్ ను రూపొందించాలని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం పిలుపునిచ్చారు. మంగళవారం ఢిల్లీలో ఇంటర్నేషనల్ టెలీ కమ్యూనికేషన్ యూనియన్, ఇండియన్ మొబైల్ కాంగ్రెస్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు.
ఏవియేషన్ సెక్టార్ కు గ్లోబల్ కమ్యూనిటీ సమగ్రమైన ఫ్రేమ్ వర్క్‌ను రూపాందించిందని తెలిపారు. అదే విధంగా డిజిటల్ వరల్డ్‌కు కూడా ప్రేమ్ వర్క్ ను రూపొందించాలన్నారు. దీనికోసం గ్లోబల్ ఇన్ స్టిట్యూషన్స్ ఏకతాటిపైకి రావాలన్నారు. ప్రస్తుతం దేశంలోని చాలా ప్రాంతాల్లో 5జీ సర్వీసులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. 6జీ సర్వీసులపై పనిచేయడం ఇప్పటికే ప్రారంభించామని మోదీ వెల్లడించారు.