సీఎం రేవంత్​కు ప్రధాని మోదీ ఫోన్ .. వర్షాలు, వరదల నష్టంపై ఆరా

సీఎం రేవంత్​కు ప్రధాని మోదీ ఫోన్ .. వర్షాలు, వరదల నష్టంపై ఆరా

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఆదివారం ఫోన్​చేశారు. రాష్ట్రంలో వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టంపై అడిగి తెలుసుకున్నారు. కేంద్రం తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందజేస్తామని, హెలికాప్టర్లను పంపిస్తామని భరోసా ఇచ్చారు.

 ప్రాణనష్టం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించిందని అభినందించారు. ఈ సందర్భంగా వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టాన్ని ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టామని తెలిపారు. ఖమ్మం జిల్లాలో ఎక్కువగా నష్టం జరిగిందని చెప్పారు. కాగా, కేంద్ర హోంమంత్రి అమిత్​షా కూడా సీఎం రేవంత్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడారు.