
న్యూఢిల్లీ: తెలంగాణ గ్రాండ్ మాస్టర్ ఎరిగైసి అర్జున్ లైవ్ చెస్ రేటింగ్‌లో 2800 మార్క్‌ను అధిగమించడం అద్భుతమైన ఫీట్ అని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. వ్యక్తిగతంగా గొప్ప మైలురాయిగా నిలిచిపోవడంతో పాటు ఎంతో మంది యంగ్‌స్టర్స్ చెస్ ఆడటానికి స్ఫూర్తిగా నిలుస్తుందని కొనియాడారు. ‘అద్భుతమైన ఫీట్‌ను సాధించిన అర్జున్‌కు అభినందనలు. అతని అసాధారణ ప్రతిభ, పట్టుదల మన దేశం గర్వించేలా చేస్తున్నాయి. ఈ ఫీట్ యంగ్‌స్టర్స్‌కు స్ఫూర్తిగా నిలుస్తుంది. అతను భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా’ అని మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.