- పీఎం ఈ–డ్రైవ్ రెండో దశ షురూ
న్యూఢిల్లీ: కార్గో ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ల కొనుగోలుదారులకు సబ్సిడీలు ఇవ్వడానికి ప్రారంభించిన రూ. 10,900 కోట్ల ప్రధానమంత్రి ఈ–డ్రైవ్ రెండో దశను కేంద్రం నోటిఫై చేసింది. ఎల్5 కేటగిరీ ఎలక్ట్రిక్ త్రీ-వీలర్‌లపై కొనసాగుతున్న సబ్సిడీలు ఇదివరకే ముగిశాయి. ఈ నెల నవంబర్ ఏడో తేదీ వరకు 80వేల వాహనాలు రిజిస్ట్రేషన్ అయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్ 1 నవంబర్ 7, 2024 మధ్య నమోదైన 80,546 వాహనాలకు సబ్సిడీ మొత్తాన్ని వాహనానికి రూ. 50వేల నుంచి సగానికి తగ్గించారు.
వాహన్ పోర్టల్‌లో నవంబర్ 8, 2024 నుంచి మార్చి 31, 2026 వరకు రిజిస్టర్ అయిన 1,24,846 వాహనాలు కిలోవాట్అవర్కు రూ. 2,500 చొప్పున సబ్సిడీలను పొందగలుగుతారు. మొదటి దశలో రూ.ఐదు వేల చొప్పున ఇచ్చారు.