
దేశం మొత్తం ఉత్కంఠ..భారత్ పాక్ మధ్య ఉద్రిక్తత నేపథ్యంలో ప్రధానిమోదీ త్రివిద దళాల అధిపతులతో భేటీ ఆసక్తికరంగా మారింది. భారత్ సైన్యాధికారులతో ప్రధాని మోదీ సమావేశం యుద్దానికి సిద్దమవుతున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా పారామిలిటరీ దళాలతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.
2025, ఏప్రిల్ 29వ తేదీ సాయంత్రం 5 గంటల 45 నిమిషాలు..ఢిల్లీలోని ప్రధాని మోదీ నివాసంలో భారత రక్షణశాఖకు చెందిన అత్యున్నత స్థాయి అధికారులు అందరూ భేటీ అయ్యారు. జమ్మూకాశ్మీర్ పహల్గాంలోని ఉగ్రదాడికి ప్రతీకార చర్యలపై చాలా చాలా సీరియస్ గా డిస్కషన్ చేశారు.
ప్రధాని మోదీతోపాటు రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, త్రివిధ దళాలకు చెందిన ఉన్నతాధికారులు..ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కు చెందిన జనరల్స్.. జాతీయ భద్రతా అధికారి అజిత్ దోవల్ కూడా ఈ సమావేశంలో పాల్గొనటం ఆసక్తిగా మారింది.
►ALSO READ | రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా, ఒక గవర్నమెంట్ జాబ్: పహల్గాం మృతుల కుటుంబాలకు సీఎం గుడ్ న్యూస్
అంతకుముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో పారామిలిటరీ దళాల హైలెవెట్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో BSF, SSG, అసోం రైఫిల్స్ అధికారులు పాల్గొన్నారు. దాదాపు 40 నిమిషాల పాటు ఈ సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ పాల్గొన్నారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పరిణామాలపై చర్చించారు. అటు కేంద్ర హోంశాఖ, ఇటు ప్రధాని మోదీ త్రివిద దళాల అధితపతులతో చర్చించడం యుద్దంపై కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.