కేంద్రంలోని మోదీ ప్రభుత్వం యువత కోసం ‘పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్’ను ప్రారంభించింది. ఈ పథకం కింద 2024-–25 ఆర్థిక సంవత్సరంలో 21 నుంచి 24 ఏళ్లలోపు 1,25,000 మంది యువతకు ఇంటర్న్‌షిప్ 12 నెలల పాటు ఉంటుంది.
అర్హత: దరఖాస్తు చేసుకునే విద్యార్థులు హైస్కూల్, హయ్యర్ సెకండరీ స్కూల్, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి సర్టిఫికేట్, డిప్లొమా లేదా పాలిటెక్నిక్ వంటివి కలిగి ఉండాలి. డిగ్రీ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. వయస్సు 21 నుంచి 24 సంవత్సరాల మధ్య మాత్రమే ఉండాలి. 12 నెలల ఇంటర్న్‌షిప్ కోసం నెలవారీ సహాయంగా రూ. 5000 అందుకుంటారు.
అప్లికేషన్ ప్రాసెస్: అభ్యర్థులు ఆన్లైన్లో అక్టోబర్ 12 నుంచి అక్టోబర్ 25 వరకు అప్లై చేయాలి. దరఖాస్తుదారులను అక్టోబర్ 26న ఎంపిక చేస్తారు. కంపెనీలు అక్టోబర్ 27 నుంచి నవంబర్ 7 వరకు అభ్యర్థులను ఎంపిక చేస్తాయి. పూర్తి వివరాలకు www.pminternship.mca.gov.in వెబ్సైట్లో సంప్రదించాలి.