- పార్లమెంట్ సెషన్ముందు అల్లర్లపై ప్రతిపక్షాలకు ప్రధాని మోదీ చురక
న్యూఢిల్లీ: పదేండ్లలో మొదటిసారి పార్లమెంట్ సమావేశాలకు ముందు విదేశీ జోక్యం కనిపించలేదని ప్రధాని మోదీ అన్నారు. తాను గత పదేండ్లుగా చూస్తున్నానని, ప్రతి సెషన్‌కు ముందు అల్లర్లు చేయడానికి కొందరు సిద్ధంగా ఉంటారని తెలిపారు. కానీ, ఈసారి వారిని రెచ్చగొట్టేవారి సంఖ్య తక్కువగా ఉందని ప్రతిపక్షాలకు పరోక్షంగా చురకలంటించారు.
పేదలు, సామాన్యులపై లక్ష్మీదేవి కృప ఎప్పటికీ ఉండాలని అన్నారు. మూడోసారి ఎన్డీయేకు ప్రజలు పట్టం కట్టారని, తాము మూడోసారి పార్లమెంట్‌లో సంపూర్ణ బడ్జెట్ ప్రవేశపెడుతున్నామని తెలిపారు. ఈ బడ్జెట్ ప్రజల్లో కొత్త విశ్వాసం నింపుతుందని చెప్పారు.
భారత్ అభివృద్ధే లక్ష్యంగా మిషన్‌మోడ్‌లో ముందుకెళ్తున్నదని, ఇన్నోవేషన్, ఇన్‌క్లూజన్, ఇన్వెస్ట్మెంట్లక్ష్యంతో దూసుకెళ్తున్నదని తెలిపారు. ఈ బడ్జెట్2047నాటికి వికసిత్ భారత్ గోల్‌ను చేరుకునేందుకు అందరిలో కొత్త విశ్వాసాన్ని, శక్తిని నింపుతుందని వెల్లడించారు.
అలాగే, పార్లమెంట్‌లో చరిత్రాత్మక బిల్లులు ప్రవేశపెడుతున్నామని, ఈ సమావేశాల్లో అన్ని అంశాలపై సమగ్ర చర్చ జరుగుతుందని తెలిపారు. సభలు సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలు సహకరిస్తాయని తాను భావిస్తున్నట్టు చెప్పారు.