రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు పడతాయి.. ఎలా చెక్ చేసుకోవాలి

పీఎం  కిసాన్  సమ్మాన్ నిధి 15 విడత డబ్బుల కోసం లబ్ధిదారులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.  తాజా సమాచారం ప్రకారం 15 విడుత డబ్బులు  నవంబర్ చివరి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. 14వ విడతను ఈ ఏడాది జూలైలో ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు.  అయితే ఇప్పుడు కేంద్రం.. ఈ పథకం కింద రైతులకు అందించే ఆర్థిక సహాయాన్ని పెంచే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఎంత పెంచనున్నారన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.  

అన్నదాతలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని 2019లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద రైతులకు ప్రతి 4 నెలలకు రూ. 2000 చొప్పున అందించనున్నారు. ఏడాదిలో మూడు విడతలుగా సంవత్సరానికి రూ. 6వేలు అందిస్తున్నారు.  ఇప్పటివరకు, పీఎం  -కిసాన్ పథకం కింద ప్రభుత్వం మొత్తం రూ. 2.50 లక్షల కోట్లను లబ్ధిదారులకు బదిలీ చేసింది.

నమోదు ప్రక్రియ ఇలా

  • పీఎం కిసాన్ యోజన పథకం ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ లో నమోదు చేసుకోవచ్చు. 
  • ఇక్కడ కూడా Pradhan Mantri Kisan Samman Nidhi  పోర్టల్ కు వెళ్లాలి. 
  • Farmers Corner క్లిక్ చేయాలి. తర్వాత New Farmers Corner క్లిక్ చేసి ఆధార్ నెంబర్, రాష్ట్రాన్ని ఎంచుకోవాలి. 
  • captcha codeను టైప్ చేయాలి. 
  • అనంతరం లబ్దిదారుడి వివరాలను ఎంటర్ చేయాలి.
  • బ్యాంకు ఖాతా, వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని ఎంట్రీ చేయాలి. 
  • సబ్మిట్ బటన్ ను క్లిక్ చేయాలి. 
  • ఆఫ్ లైన్ రిజిస్ట్రేషన్ కోసం సమీపంలో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్ (CSC)ను సందర్శించాల్సి ఉంటుంది. అక్కడ ఇచ్చే దరఖాస్తు ఫారం పూర్తి చేయాలి.


పీఎం- కిసాన్ eKYC పూర్తి చేయడం ఇలా...

  • పీఎం - కిసాన్ అధికారిక వెబ్ సైట్ (https.//pmkisan.gov.in/)ను సందర్శించాలి. 
  • కుడి వైపున అందుబాటులో ఉన్న eKYCపై క్లిక్ చేయండి.
  • ఆధార్ కార్డు నెంబర్ ను ఎంటర్ చేయాలి. అనంతరం Capcha కోడ్ ను నమోదు చేసి సెర్చ్ పై క్లిక్ చేయండి.
  • ఆధార్ కార్డుతో లింక్ చేసిన మొబైల్ నెంబర్ ను ఎంట్రీ చేయాలి. 
  • Get OTPపై క్లిక్ చేయండి. వచ్చిన OTPని నమోదు చేయాలి.
  • అన్ని వివరాలు సరైనవి అయితే.. eKYC ప్రక్రియ పూర్తవుతుంది. ఒకవేళ ఏదైనా సమస్యలు వస్తే.. స్థానికంగా ఉన్న ఆధార్ సేవా కేంద్రాన్ని సంప్రదించాలి.

ALSO READ :- హద్దులు దాటేస్తున్న శర్వా 35 బడ్జెట్!.. సాహసం చేస్తున్న ఆ ప్రొడ్యూసర్స్ ?