
పీఎం కిసాన్ రైతులకు భారీ శుభవార్త.. జూన్ 5 నుంచి పీఎం కిసాన్ రైతుల కోసం స్పెషల్ సర్వీసులు అందించేందుకు ఏర్పాట్లు చేసింది. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ స్కీమ్‌ను ఎంతో ప్రతిష్టాత్మంగా అమలు చేస్తోంది. తాజాగా ఈ స్కీమ్‌కు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. ప్రభుత్వం అన్నదాతలకు ఊరట కలిగే నిర్ణయం తీసుకుంది. దీని వల్ల చాలా మందికి బెనిఫిట్ పొందే అవకాశం ఉంది.
కేంద్ర ప్రభుత్వం జూన్ 5 నుండి జూన్ 15 వరకు PM కిసాన్ సాచురేషన్ డ్రైవ్‌ను నిర్వహిస్తుంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ప్రయోజనాలను పొందడానికి ఈ డ్రైవ్ ఉపయోగపడుతుంది. దీని ద్వారా అన్నదాతలు మీ ఇకేవైసీని పూర్తి చేసుకోవచ్చు. పీఎం కిసాన్ స్కీమ్ కింద డబ్బులు పొందే అన్నదాతలు ఇ–కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి. అలా చేయని రైతులకు రైతులు పీఎం కిసాన్ యోజన ప్రయోజనం పొందలేరు. అంటే 17వ విడత సొమ్ము వారి ఖాతాల్లో జమకాదు. మళ్లీ రూ. 2 వేలు పొందలేరు.
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనేది ప్రపంచంలోనే అతిపెద్ద డీబీటీ పథకం. ఇది రైతులకు సంవత్సరానికి రూ. 6 వేలు ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ డబ్బులు ఒకేసారి కాకుండా విడతల వారీగా అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో పడుతాయి. ఇ–కేవైసీ పూర్తి చేసుకోని రైతులు వెంటనే ఆ పని పూర్తి చేసుకోవాలి.నాలుగు నెలలకు ఒకసారి రూ. 2 వేల చొప్పున మొత్తంగా మూడు సార్లు రూ. 6 వేలు అర్హత కలిగిన రైతుల బ్యాంక్ ఖాతాల్లో పడుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం 16 విడతల డబ్బులను అందించింది. ఇకపై 17 వ విడత డబ్బులు రావాల్సి ఉంది. ఈ నెలలో లేదంటే వచ్చే నెల ఆరంభంలో ఈ డబ్బులు రైతుల బ్యాంక్ ఖాతాల్లో పడనున్నాయి.
కేంద్ర ప్రభుత్వపు పీఎం కిసాన్ సాచురేషన్ డ్రైవ్ సమయంలో నాలుగు కీలక పనులను పూర్తి చేసుకోవచ్చు. రైతులు పీఎం కిసాన్ పోర్టల్ లేదా యాప్ ద్వారా ఇకేవైసీ పూర్తి చేసుకోవచ్చు. అలాగే పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంకా భూమి వివరాలను పోర్టల్‌కు అప్‌లోడ్ చేయవచ్చు. బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో లింక్ చేసుకోవచ్చు.మరింత సమాచారం కోసం, మీ సమీప CSC (కామన్ సర్వీస్ సెంటర్) లేదా రాష్ట్ర సేవా కేంద్రాన్ని సందర్శించండి. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత ( జూన్ 4 ) ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 17వ విడత విడుదల అయ్యే అవకాశం ఉంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 16వ విడతను ఫిబ్రవరి 28న ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు.