పీఎం కిసాన్.. ఊర్ల ఉన్నోళ్లకే

పీఎం కిసాన్.. ఊర్ల ఉన్నోళ్లకే

గ్రామాల్లో నివాసం ఉండే వారికే పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి వర్తిస్తుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉమ్మడి కుటుంబంలోని కుటుంబాలకు ఐదెకరాల్లోపు భూమి ఉంటే వారు అర్హులేనని వెల్లడించింది. ఐదు ఎకరాల లోపు భూమి వేర్వేరు రెవెన్యూ రికార్డుల్లో ఉన్నా, వేర్వేరు గ్రామాల్లో ఉన్నా పథకం వర్తిస్తుందని చెప్పింది. ఈ మేరకు బుధవారం పీఎం కిసాన్‌ కు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది. లబ్ధిదారుల వివరాలను ఈ నెల 25లోగా పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి వెబ్‌ సైట్‌‌లో అప్‌ లోడ్‌‌ చేయాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. ఆలోపు అప్‌ లోడ్‌‌ చేసిన వారికే రూ.2 వేలు బదిలీ అవుతాయని పేర్కొంది. తొలి విడత ఇన్‌ స్టాల్‌ మెంట్‌‌కు 2018 డిసెంబర్‌ 1 నుంచి మిగతా 419 మార్చి 31ను లెక్కలోకి తీసుకుంటున్నట్టు చెప్పింది. తొలి జాబితా ఈ ఏడాది వరకే అమలులో ఉంటుందని వెల్లడించింది. లబ్ధిదారులు గ్రామంలోనే ఉంటున్నామని వ్యక్తి గత హామీ పత్రం (సెల్ఫ్‌ డిక్లరేషన్‌‌‌‌ ) ఇవ్వాలని, సెల్ఫ్‌ డిక్లరేషన్‌‌‌‌ అవాస్తవమైతే సొమ్మును రికవరీ చేసుకోవడంతో పాటు న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

మార్గదర్శకాలివే

ఉమ్మడి కుటుంబానికి 25 ఎకరాలుండి 5 కుటుంబాలకు తలా 5 ఎకరాలుంటే ప్రతి కుటుంబానికి పథకం వర్తిస్తుంది.

ఉమ్మడి కుటుంబంలోని 12 కుటుంబాలకు 40 ఎకరాలు ఉంటే వారిలో 4 కుటుంబాలకు రెండున్నర ఎకరాలు చొప్పున, మరో 8 కుటుంబాలు 3
ఎకరాల 30 గుంటల చొప్పున ఉంటే పీఎం కిసాన్‌‌‌‌ వర్తిస్తుంది.

25 ఎకరాల భూమి ఉన్న 4 కుటుంబాల్లో ఒక కుటుంబానికి 13 ఎకరాల 30 గుంటలు ఉండి మిగతా 3 కుటుంబాలు మూడెకరాల ముప్పై గుంటలు ఉంటే తక్కువ భూమి ఉన్న కుటుంబాలకు వర్తిస్తుంది.

నాలుగున్నర ఎకరాల భూమి వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నా, వేర్వేరు రెవెన్యూ రికార్డుల్లో ఉన్నా, ఒక గ్రామంలో గానీ వేర్వేరు గ్రామాల్లో ఉన్నా అర్హులే.

భూ యజమాని చనిపోతే కుటుంబంలో అర్హులైన వారి పేరు 2018 డిసెంబర్‌‌‌‌ 1–2019 ఫిబ్రవరి 1లోగా భూ రికార్డుల్ లో చేర్చి ఉండాలి.

భూ యజమాని భూమి అమ్మినా, బహుమతిగా ఇచ్చినా, వారసత్వపు హక్కు ఇచ్చినా గడువులోగా రి కార్డుల్ లో చేర్చితే తొలి విడత సొమ్ము ఇస్తారు.

అర్హుల వివరాలను పంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శిస్తారు.

5 ఎకరాల్లోపు భూమి ఉన్నా..

రాజ్యాంగ పదవుల్లో ఉన్న రైతులకు పథకం ​వర్తించదు.

మాజీ మంత్రులు, ప్రస్తుతం కొ నసాగుతున్న వారు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోక్‌‌‌‌సభ, రాజ్యసభ సభ్యు లు, మేయర్లు, జిల్లా పరిషత్‌‌‌‌ చైర్మన్లు, పదవీవిరమరణ చేసిన, ప్రస్తుతం కొ నసాగుతున్న కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, స్వయం ప్రతిపత్తి సంస్థల ఉద్యోగులు (క్లాస్‌‌‌‌ ఫోర్త్‌‌‌‌ ఎంప్లాయిస్‌‌‌‌తో సహా)లూ అనర్హులు.

10 వేలకు పైగా పెన్షన్‌‌‌‌ వస్తున్న వాళ్లు.. -డాక్టర్లు , లాయర్లు, చార్టర్డ్‌‌‌‌ అకౌంటెంట్‌‌‌‌లు, ఆర్కి టెక్ట్‌‌‌‌లు తదితర ప్రొఫెషనల్స్‌‌‌‌కు వర్తించదు.