రైతులకు గుడ్ న్యూస్..18 విడత పీఎం కిసాన్ యోజన స్కీం నిధులు శనివారం ( అక్టోబర్ 4) ప్రధాని మోదీ విడుదల చేశారు. పీఎం కిసాన్ 18వ విడత నిధులు రూ. 20వేల కోట్లు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ విధానంలో రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఆర్థికంగా ఆదుకునేందుకు ఈ స్కీం ద్వారా ఎటువంటి మధ్యవర్తిత్వం లేకుండా దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 9.4కోట్ల మంది రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారు.
జూలై 18, 2024న 17 వ విడత పీఎం కిసాన్ నిధులు 21వేల కోట్లు ప్రధాని మోదీ రైతుల ఖాతాల్లో జమ చేశారు. 9.26 కోట్ల మంది రైతులు లబ్ది పొందారు. 16వ విడత పీఎం కిసాన్ నిధులు 2024 ఫిబ్రవరిలో విడుదల చేశారు.
పీఎం కిసాన్ స్కీం కింద ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ. 2వేల చొప్పున మొత్తం మూడు దఫాలుగా ప్రతియేటా 6వేల రూపాయలు అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ప్రతి సంవత్సరం ఏప్రిల్-జూలై, ఆగస్టు -నవంబర్, డిసెంబర్ -మార్చి మూడు వాయిదాల్లో డబ్బు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారు.
Also Read : పోలీసులకు ఎమ్మెల్యే వార్నింగ్
పీఎం కిసాన్ పథకాన్ని 2019లో ప్రధాని మోదీ ప్రారంభించారు. అప్పటినుంచి క్రమం తప్పుకుండా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారు. ఈ స్కీం ప్రపంచంలోనే అతిపెద్ద డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ పర్ స్కీంగా మారింది.