ప్రకృతిని ధ్వంసం చేస్తుండ్రు.. వన్యప్రాణులను చంపుతుండ్రు : ప్రధాని మోదీ

ప్రకృతిని ధ్వంసం చేస్తుండ్రు.. వన్యప్రాణులను చంపుతుండ్రు : ప్రధాని మోదీ
  • అడవుల్లో బుల్డోజర్లు నడపడంలో బిజీ ఉన్నరు
  • ప్రజలకు ఇచ్చిన హామీలు మరచిపోయిండ్రు
  • తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై మోదీ ఫైర్


ఢిల్లీ: కంచ గచ్చిబౌలి భూములపై ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ హర్యానా యమునా నగర్ ర్యాలీలో  ప్రధాని కాంగ్రెస్ పార్టీపై, తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు.  ‘ప్రకృతిని ధ్వంసం చేయడం,  వన్యప్రాణులను చంపడంలో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం బిజీగా ఉంది.  అడవులపై బుల్డోజర్లు నడిపించడంలో తెలంగాణ సర్కార్‌ బిజీగా ఉంది. మేం పర్యావరణాన్ని కాపాడుతుంటే.. వాళ్లు అటవీ సంపదను నాశనం చేస్తున్నారు. గ్యారెంటీల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేశారు’ అని వ్యాఖ్యానించారు. 

కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి రావడమే ముఖ్యమని అన్నారు. కానీ తాము మాత్రం కొత్తగా అడవులను సిద్ధ చేసేందుకు కష్టపడుతున్నామని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఉన్న అడవిని నాశనం చేస్తోందని అన్నారు. కాంగ్రెస్ విధానం విధ్వంసం చేయడమేనని పేర్కొన్నారు. ‘ప్రభుత్వాన్ని నడపడంలో రెండు మోడళ్లున్నాయి.. కుర్చీ గురించే వాళ్లు ఆలోచిస్తరు.. మేం సత్యమార్గంలో పయనించే వాళ్లం.. అంబేద్కర్ మార్గంలో పనిచేస్తున్న వాళ్లం’ అని ప్రధాన మంత్రి అన్నారు. .