కాంగ్రెస్కు జిరాక్స్ ఆమ్ ఆద్మీ పార్టీ:మోడీ

పంజాబ్ లో ప్రచారంతో హోరెత్తిస్తున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. పఠాన్ కోట్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలపై విమర్శల బాణాలు సంధించారు. పంజాబ్ ప్రజల కోసం పనిచేసే అవకాశం బీజేపీకి ఇవ్వాలని కోరారు. ఒక్క ఐదేళ్లు ఛాన్స్ ఇచ్చి చూడండి పంజాబ్ రూపు రేఖలు మొత్తం మార్చివేస్తామని చెప్పారు. కాంగ్రెస్ ఒరిజినల్ అయితే ఆప్ దాని జిరాక్స్ అని ఆరోపించారు. ఒకరు పంజాబ్ ను లూటీ చేస్తే మరొకరు ఢిల్లీలో స్కామ్ లకు పాల్పడ్డారని విమర్శలు గుప్పించారు. దేశంలో కోవిడ్ మహమ్మారి ఉన్నప్పటికీ పేదల కోసం ఉచిత రేషన్ అందజేస్తున్నామని చెప్పారు. ఎవరూ ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో కోట్లాది మందికి ఫ్రీ రేషన్ అందజేస్తున్నామని తెలిపారు. 

మరిన్ని వార్తల కోసం

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ బప్పి లహిరి మృతి

ప్రభాస్ మూవీలో ఛాన్స్ కొట్టేసిన మాళవిక మోహనన్