మోదీ అమెరికా టూర్ : ట్రంప్ తో భేటీకి సన్నాహాలు

మోదీ అమెరికా టూర్ : ట్రంప్ తో భేటీకి సన్నాహాలు

 అతి త్వరలో.. అంటే 2025, ఫిబ్రవరి నెలలోనే మన ప్రధాని మోదీ అమెరికా టూర్ వెళ్లబోతున్నారు. అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ తో భేటీ కానున్నారు. ఈ మేరకు విదేశీ వ్యవహారాల శాఖ కసరత్తు చేస్తోంది. మొన్నటికి మొన్న ట్రంప్ తో.. మోదీ మాట్లాడిన సమయంలో వైట్ హౌస్ కు రావాలని ఆహ్వానించినట్లు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది. ఫిబ్రవరి నెలలో మోదీ అమెరికా పర్యటన దాదాపు ఉండొచ్చనేది చెబుతోంది.

ప్రధాని నరేంద్ర మోదీ .. అమెరికా పర్యటనకు సంబంధించి భారత్, అమెరికా ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ  తెలిపింది.  ఈ విషయంలో MEA ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ ఇంకా తేదీలు ఖరారు కాలేదని.. త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. 

Also Read :- కేజ్రీవాల్‎కు భారీ షాక్.. ఒకేసారి ఆరుగురు ఎమ్మెల్యేల రాజీనామా

అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయనతో ప్రధాని మోది టెలిఫోన్​ లో మాట్లాడారు.  వైట్​ హౌస్​ లో  జరిగే సమావేశంలో ఇమ్మిగ్రేషన్​పై  చర్చించే అవకాశం ఉంది. అమెరికాలో ఉంటున్న భారతీయుల విషయంలో ప్రధాని మోదీ.. అమెరికా అధ్యక్షుడు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. భారత్‌తో అమెరికాకు మంచి అనుబంధం ఉందని.. ఫిబ్రవరిలో  భారత ప్రధాని వైట్‌హౌస్‌కు రావొచ్చని చెప్పారు. ఈ భేటీలో భారత్​.. అమెరికా మధ్య కొన్ని కీలక ఒప్పందాలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.