తెలంగాణలో బీజేపీకి ఇచ్చిన మద్దతుకు ధన్యవాదాలు. గత కొన్నేండ్లుగా మాకు మద్దతు పెరుగుతూనే ఉంది. ఈ సరళి రాబోయే కాలంలో కూడా కొనసాగుతుంది. తెలంగాణతో మా బంధం విడదీయరానిది. ప్రజల కోసమే మేం పని చేస్తున్నాం. రాబోయే రోజుల్లో రాష్ట్ర అభివృద్ధిని బీజేపీ కొనసాగిస్తూనే ఉంటుంది. ప్రజల మద్దతుతో తెలంగాణను సంపన్న రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం.
- మోదీ, అమిత్ షా