Wayanad Landslide: వయోనాడ్ విషాదంపై స్పందించిన ప్రధాని మోదీ, రాహుల్

Wayanad Landslide: వయోనాడ్ విషాదంపై స్పందించిన ప్రధాని మోదీ, రాహుల్

 కేరళ వయోనాడ్ లో కొండ చరియలు విరిగిపడిన ఘటనపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు.మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.  కేరళ సీఎం పినరయి విజయన్ తో ఫోన్ లో మాట్లాడి..ప్రమాద తీవ్రతపై ఆరా తీశారు. కేంద్రం నుంచి సాయం కొనసాగుతుందన్నారు.  ఘటనలో చనిపోయిన వారి ఫ్యామిలీలకు రెండు లక్షల రూపాయల ఎక్స్  గ్రేషియా ప్రకటించారు. గాయపడ్డవారికి 50వేల రూపాయలు ఇస్తామని తెలిపారు. 

ఇక ప్రమాదంపై స్పందించారు లోక్ సభ పక్ష నేత రాహుల్ గాంధీ.  ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ.. ప్రమాదంపై కేరళ సీఎం పినరయి విజయన్ తో  ఫోన్లో మాట్లాడారు. బాధితులకు అండగా ఉండాలని కోరారు. వర్షాలు కురుస్తుండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు.

Also Read:-కేరళలో విరిగిపడ్డ కొండచరియలు..24 మంది మృతి

 వయోనాడ్  జిల్లాలోని మెప్పాడ్ ప్రాంతంలో కొండచరియలు విరిగి పడిన  ఘటనలో మృతుల సంఖ్య 24కి చేరింది.  ఇంకా శిథిలాల కింద వందలాది మంది చిక్కుకున్నారు.సహాయక చర్యలు కొనసాగున్నాయి.