పాలమూరు ప్రజాగర్జనలో ప్రధాని మోడీ కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో జాతీయ పసుపు బోర్టు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు . పసుపు రైతుల సంక్షేమం కోసం జాతీయ పసుపు బోర్టు ఏర్పాటు చేస్తాన్నామని తెలిపారు. పసుపు రైతుల కష్టాల గుర్తించే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కరోనా తర్వాత పసుపు వినియోగం పెరిగిందన్నారు. తెలంగాణలో రైతులు పసుపును ఎక్కువ పండిస్తున్నారని చెప్పారు. పసుపు బోర్టు ఏర్పాటుతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. కరోనా తర్వాత పసుపు గొప్పతనం ప్రపంచానికి తెలిసిందన్నారు. అలాగే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ స్థాయిని పెంచారు. ఇకపై ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ గా హెచ్ సీయూ ఉండనుందని తెలిపారు.
పాలమూరులో రూ.13,545 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. నా కుటుంబ సభ్యుల్లారా అంటూ తెలుగులో తన ప్రసంగం ప్రారంభించిన మోడీ.. దేశంలో పండుగల సీజన్ నడుస్తోందన్నారు. ఇటీవలే నారీ శక్తివందన్ బిల్లును పార్లమెంట్ లో ఆమోదించుకున్నానమి చెప్పారు. హైవేల ద్వారా తెలంగాణ, మహారాష్ట్ర, ఏపీ మధ్య రవాణా సదుపాయం మెరుగవుతుందని తెలిపారు.