హైదరాబాద్లో ప్రధానికి ఘన స్వాగతం

కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ కు వచ్చారు ప్రధాని మోడీ. బేగంపేట్ ఎయిర్ పోర్టు చేరుకున్న ఆయనకు గవర్నర్ తమిళసై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మంత్రి తలసాని, బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్ స్వాగతం పలికారు. బీజేపీ శ్రేణులు బేగంపేట్ కు భారీగా తరలివచ్చారు. బేగంపేట్ లో బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. 

అయితే షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం ఒకటిన్నరకు మోడీ రావాల్సి ఉండగా..40 నిమిషాల ముందుగానే ప్రధాని హైదరాబాద్ కు వచ్చారు. కార్యకర్తలతో భేటీ  తర్వాత హెలికాప్టర్ లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హెలిపాడ్ కు చేరుకుంటారు. మధ్యాహ్నం గచ్చిబౌలి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ 20 వ వార్షికోత్సవానికి హాజరుకానున్నారు ప్రధాని. గంటా 15 నిమిషాల పాటు వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. గోల్డ్ మెడల్ సాధించిన 8 మంది విద్యార్థులకు మెడల్స్, పట్టాలు అందజేస్తారు. మధ్యాహ్నం 3 గంటల 50 నిమిషాలకు హెలికాప్టర్ లో బయల్దేరి బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి స్పెషల్ ఫ్లైట్ లో చెన్నైకి వెళ్లనున్నారు మోడీ.

ఇవి కూడా చదవండి

షెడ్యూల్ టైం కంటే ముందుగానే మోడీ రాక

మోడీజీ..కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ ఏమైంది?

రూ.12లక్షలు పెట్టి మరీ కుక్కలా మారాడు