ప్రధాని మోదీ ఉక్రెయిన్ చేరుకున్నారు. ఒక్కరోజు పర్యటనలో భాగంగా ఆగస్టు 23న ఉదయం 7.30 గంటలకు ఉక్రెయిన్ చేరుకున్నారు మోదీ. అక్కడ మోదీకి ఘన స్వాగతం పలికారు అధికారులు గత రెండు సంవత్సరాలకు పైగా రష్యా, ఉక్రెయిన్ మధ్య వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాని మోదీ ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీతో భేటీ ఆసక్కికరంగా మారింది. 1991లో ఉక్రెయిన్‌కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారత ప్రధాని ఉక్రెయిన్ కు వెళ్లడం ఇదే తొలిసారి.
Also Read:-టిక్ టాక్ పై బ్యాన్ ఎత్తివేసిన దేశం
10 గంటలు రైలులో ప్రయాణం
పొలాండ్ నుంచి ఉక్రెయిన్ పర్యటన కోసం మోదీ ‘ట్రైన్‌ఫోర్స్ వన్’ అనే విలాసవంతమైన రైలులో ఆగస్టు 22 సాయంత్రం బయలుదేరారు. యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో విమానాశ్రయాలకు భద్రత కరువైంది. రోడ్డు మార్గాలు దెబ్బతిన్నాయి. దీంతో ఆయన రైల్లో పది గంటలు ప్రయాణించి కీవ్ కు చేరుకున్నారు. అత్యాధునిక టెక్నాలజీతో తయారు చేసిన ఈ ట్రైన్లో అన్ని రకాల సౌలత్లు ఉంటాయి.