రాష్ట్రపతి ధన్యవాద తీర్మానం సందర్భంగా ప్రధాని మోదీ లోక్ సభలో ప్రతిపక్ష కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ, దాని మిత్ర పక్షాలు రాజ్యాంగ స్పూర్తితో జీవిస్తాయని అన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై మండిపడ్డారు.
బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే... రాజ్యాంగాన్ని మార్చేస్తుందని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ప్రధాని మోదీ తీవ్రంగా విమర్శించారు. అధికారం వంశపారపర్యం అయితే ప్రజాస్వామ్యం అంతం అవుతుందని అన్నారు ప్రధాని మోదీ. ఎన్నికల సంఘం సమావేశంలో ప్రతిపక్ష నేతలను చేర్చుకున్నాం.. మేం రాజ్యాంగాన్ని బతికించాలని నమ్మకంతో ఇలా చేస్తున్నామన్నారు ప్రధాని మోదీ.
ALSO READ | Viral news: రేషన్ కార్డు కాదు..ఇది వెడ్డింగ్ కార్డు
ప్రతిపక్ష నేతలు బహిరంగంగా అర్బన్ నక్సల్స్ లా మాట్లాడుతున్నారు. భారత రాజ్యంపై యుద్ధం ప్రకటించే వారు దేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అర్థం చేసుకోలేరని అన్నారు. వివక్ష చూపమని మాకు ఎప్పుడూ రాజ్యాంగం చెప్పలేదు. వివక్ష అంటూ తిరిగేవారు ముస్లిం మహిళలను ఎప్పుడు పట్టించుకోలేదని ప్రధాని మోదీ విమర్శించారు.