2023 వరల్డ్ కప్ ఫైనల్ కు భారత్, ఆస్ట్రేలియా జట్లు వచ్చేసాయి. 5 సార్లు ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో భారత్ తుది పోరుకు సిద్ధమైంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ఈ మ్యాచ్ కు వేదిక కానుంది. ఈ మ్యాచ్ ఆదివారం(నవంబర్ 19) మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం అవుతుంది. లక్ష 30 వేల సామర్ధ్యం కలిగి ఉన్న ఈ స్టేడియంలో మ్యాచ్ చూసేందుకు అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ మ్యాచ్ కు పలు సెలబ్రిటీలతో పాటు భారత, ఆస్ట్రేలియా ప్రధానులు హాజరుకానున్నారు.
ప్రధాని మోదీ, అల్బనీస్ కలిసి భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ కు హాజరు కానున్నారు. ఇప్పటికే భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ మ్యాచ్ కు వస్తున్నట్లు అధికారికంగా ప్రకటించేశారు. ఆస్ట్రేలియా జట్టు దక్షిణాఫ్రికాపై సెమీస్ లో గెలిచి ఫైనల్ కి వెళ్లడంతో ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ ఈ మ్యాచ్ చూసేందుకు భారత్ కు వస్తున్నారు. మ్యాచ్ సమయానికి అహ్మదాబాద్ చేరుకుంటారు. ఈ ఏడాది భారత్ ఆస్ట్రేలియా నాలుగో టెస్ట్ సందర్భంగా ఈ ఇద్దరు ప్రధానులు మ్యాచ్ ను చూసిన సంగతి తెలిసిందే. ఈ టెస్ట్ అహ్మదాబాద్ స్టేడియంలోని జరిగింది.
ఇద్దరు ప్రధానులు నరేంద్ర మోదీ స్టేడియంలోని ‘హాల్ ఆఫ్ ఫేమ్’ మ్యూజియాన్ని కూడా సందర్శించారు. మే 2022లో ఆస్ట్రేలియా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధాని మోదీ, అల్బనీస్ మధ్య ఇది నాలుగో సమావేశాలు జరిగాయి. ఇరు దేశాల ప్రధానులు ఈ మ్యాచ్ ను చూసేందుకు వస్తుండడంతో ఈ మ్యాచ్ పై మరింత ఆసక్తి పెరిగింది.