నేడు తెలుగు రాష్ట్రాల్లో మోడీ ప్ర‌చారం

రానున్న లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు సంబంధించి దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ నేడు తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌చారం నిర్వ‌హించనున్నారు. తెలంగాణలోని మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌లో మ‌రియు ఏపీలోని క‌ర్నూల్ లో బీజేపీ నేత‌లు ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌ల్లో మోడీ ప్ర‌స‌గించ‌నున్నారు. తెలంగాణ‌లో పర్యటన ముగిసిన అనంతరం కర్నూలు జిల్లాలో మోడీ ప్రచార సభ నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు కర్నూలు చేరుకొని స్థానిక‌ ఎస్టీబీసీ కళాశాల మైదానంలో జరిగే బీజేపీ బహిరంగ సభలో మోడీ ప్రసంగించనున్నారు. కాగా ప్రధాని పర్యటన సందర్భంగా ఇరు రాష్ట్రాల పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.