సైనికులతో మోడీ దీపావళి సెలబ్రేషన్స్

సైనికులతో మోడీ దీపావళి సెలబ్రేషన్స్

నౌషెరా: జమ్మూ కశ్మీర్‌‌లోని నౌషెరా సెక్టార్‌‌కు వెళ్లారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈ ఏడాది కూడా జవాన్లతో కలసి ఆయన దీపావళి  పండుగ జరుపుకున్నారు. ఈ సందర్భంగా  అమర జవాన్లకు మోడీ నివాళులర్పించారు. 2014 లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రతి దివాళీకి.. బోర్డర్‌‌లోని అవుట్ పోస్టులకు వెళ్లి సైనికులతో కలసి  దీపావళి పండుగను చేసుకుంటున్నారు మోడీ. స్వయంగా జవాన్లకు స్వీట్స్ తినిపించి పండుగ శుభాకాంక్షలు చెప్పారు. తాను ఇక్కడకు ప్రధానిగా రాలేదని.. 130 కోట్ల మంది భారతీయుల ప్రతినిధిగా వచ్చానన్నారు మోడీ. 

సైనికులతో దీపావళి జరుపుకోవడం ఆనందంగా ఉందని మోడీ అన్నారు. దేశానికి సైన్యమే సురక్షా కవచమన్నారు. ప్రతికూల పరిస్థితుల్లో దేశానికి సైనికులు రక్షణగా నిలుస్తున్నారని చెప్పారు. సర్జికల్ స్ట్రయిక్స్‌‌‌‌లో సైన్యం పాత్ర దేశానికే గర్వకారణమన్నారు. సోల్జర్స్ వల్లే ప్రజలు ప్రశాంతంగా నిద్రపోతున్నారని తెలిపారు. అయితే నౌషెరా సెక్టార్‌‌కు మోడీ ఎలాంటి ప్రోటోకాల్ పాటించకుండా.. మినిమమ్ సెక్యూరిటీతో సామాన్యుడిలా వెళ్లడం గమనార్హం. రోడ్డుపై రెడ్ సిగ్నల్ పడటంతో కారు ఆపి వెయిట్ చేశారు. గ్రీన్ సిగ్నల్  పడిన తర్వాతే బయలుదేరడం విశేషం. 

మరిన్ని వార్తల కోసం: 

కేంద్రం పెట్రో రేట్లు తగ్గించింది.. కేసీఆర్.. మీరెప్పుడు తగ్గిస్తారు?

విశ్లేషణ: చైనా చేతిలో ప్రపంచ దేశాల డీఎన్​ఏ డేటా?

క్రాకర్స్ కాలుస్తున్నారా..? ఇవి గుర్తుపెట్టుకోండి