‘ఓం శాంతి’.. పహల్గాం ఉగ్రదాడి మృతులకు ప్రధాని మోడీ సంతాపం

‘ఓం శాంతి’.. పహల్గాం ఉగ్రదాడి మృతులకు ప్రధాని మోడీ సంతాపం

పాట్నా: పహల్గాం ఉగ్రదాడి మృతులకు ప్రధాని మోడీ సంతాపం తెలిపారు. వివిధ పనుల ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనల కోసం గురువారం (ఏప్రిల్ 24) మోడీ బీహార్‎లోని మధుబనీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన బహిరంగంగా తొలిసారి పహల్గాం టెర్రర్ ఎటాక్ ఇన్సిడెంట్‎పై స్పందించారు. ఏప్రిల్ 22న మనం అమాయక ప్రజలను కోల్పోయామని.. వారి ఆత్మకు శాంతి చేకూరడం కోసం 2 రెండు నిమిషాల పాటు మౌనం పాటించాలని కోరారు. దీంతో ప్రధాని మోడీతో పాటు అక్కడ ఉన్న వారు పహల్గాం ఉగ్రదాడి మృతులకు సంతాపంగా 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం ఓం శాంతి అంటూ మోడీ నినాదాలు చేశారు. 

కాగా, జమ్ముకాశ్మీర్‎లోని పహల్గాం ప్రాంతం బైసారన్ మైదాన ప్రాంతంలో మంగళవారం (ఏప్రిల్ 22) ఉగ్రవాదులు మారణహోమం సృష్టించిన విషయం తెలిసిందే. కుటుంబంతో కలిసి సరదాగా టైమ్ స్పెండ్ చేసేందుకు వచ్చిన పర్యాటకులపై ఉగ్రవాదులు విచక్షణరహితంగా కాల్పులు జరపడంతో 26 మంది అమాయక ప్రజలు మృతి చెందగా.. మరికొందరు బుల్లెట్ గాయాలకు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో యావత్ దేశమంతా ఉలిక్కిపడింది. ఈ క్రమంలో పహల్గాంలో రక్తపుటేరులు పారించిన ముష్కరులు కోసం భద్రత దళాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. జమ్మూ కాశ్మీర్‎లోని పలు ప్రాంతాల్లో భద్రతా దళాలు ఉగ్రవాదుల కోసం అడుగడుగునా నిశితంగా పరిశీలిస్తు్న్నాయి.